కొన్ని కొన్ని వార్తలు విన్నప్పుడు నవ్వకుండా ఉండలేము. కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. ఆసుపత్రి వైద్యులు ఎక్స్రే తీయగా. రోగి శరీరంలో గ్లాసు ఆకారంలో ఏదో ఉన్నట్లు బయట పడింది. దీంతో రోగికి శస్త్రచికిత్స నిర్వహించారు డాక్టర్లు. విజయవంతంగా గ్లాసును రోగి కడుపులో నుంచి బయటకు తీశారు. అయితే అసలు గ్లాస్ కడుపులోకి ఎలా వెళ్లిందనేది వైద్యుల సందేహం. ఈ అరుదైన ఘటన ఉత్తర్ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని జౌన్ పూర్ జిల్లాలోని గోత్వా భటౌలీ గ్రామానికి చెందిన సమరనాథ్.. కొన్ని రోజుల నుంచి కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. రోజు రోజూకు నొప్పి ఎక్కువ కావడంతో చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడు లాల్ బహదూర్ వద్దకు వెళ్లాడు. పరిశీలించిన వైద్యులు ఎక్స్ రే తీయాలని చెప్పారు. దీంతో ఎక్స్రే తీసిన ఆస్పత్రి సిబ్బంది కడుపులో గ్లాసు లాంటి ఆకారాన్ని గుర్తించారు. సుమారు గంట పాటు వైద్యబృందం శ్రమించి సమరనాథ్ కడుపులో నుంచి స్టీల్ గ్లాసును బయటకు తీశారు. అయితే ఆ రోగి కడుపులోకి అంత పెద్ద స్టీల్ గ్లాస్ ఎలా వెళ్లిందని సమర నాథ్ భార్యను వైద్యులు అడిగారు. దీంతో తన భర్తకు హెర్నియా ఉందని తెలిపింది. చాలా రోజుల నుంచి తన భర్త సరిగ్గా తినట్లేదని, మలమూత్ర విసర్జనకు వెళ్లట్లేదని చెప్పింది. రోగి గురించి ఆస్పత్రి వైద్యుడు మాట్లాడుతూ.."సమరనాథ్ నా దగ్గరకి చికిత్స కోసం వచ్చాడు. ఏంటి ఆరోగ్య సమస్య అని అడగగా కడుపు నొప్పిగా ఉందని చెప్పాడు. స్టీల్ గ్లాసు ఎలా కడుపులోకి వెళ్లిందని రోగిని ప్రశ్నించగా.. నోటి ద్వారా వెళ్లిందని చెప్పాడు. నిజానికి అతడు చెప్పింది అబద్దం. నోటి ద్వారా గ్లాసు కడుపులోకి వెళ్లే అవకాశం లేదు. స్టీల్ గ్లాసు కచ్చితంగా మలద్వారం నుంచే కడుపు లోపలికి వెళ్లి ఉంటుంది" అని వైద్యుడు తెలిపాడు. మరి.. ఈ వింత ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: దారుణం: 8వ తరగతి కూతురిని తల్లిని చేసిన తండ్రి! ఇదీ చదవండి: 12 ఏళ్లుగా మహిళ కడుపులో కత్తెర! రూ.లక్షల్లో పరిహారం చెల్లించిన ఆస్పత్రి..