సోషల్ మీడియా పుణ్యమా అని వింతలు, విశేషాలు నిత్యం మనముందు కదులాడుతున్నాయి. ప్రపంచంలో ఏమూల.. ఏం జరిగినా క్షణాల్లో మనకు తెలిసిపోతోంది. అందులో మంచి చెడులు పక్కనపెడితే నమ్మశక్యం కానీ ఘటనలు ఎన్నో మనకంట పడుతుంటాయి. అలాంటి ఘటనే.. ఇది. ఒక మహిళ చెవిలో పాము ఇరుక్కున్నది. దానిని ఆమె చెవి నుంచి తీసేందుకు ఒక డాక్టర్ తెగ ప్రయత్నించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
‘చెవి లోపలకు పాము వెళ్లింది’ అనే క్యాప్షన్ తో చందన్ సింగ్ అనే ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో చూస్తే.. చేతులకు గ్లౌజ్‌లు వేసుకున్న డాక్టర్ ఫోర్‌సెప్స్‌తో నోరు తెరిచిన ఆ పామును మహిళ చెవి నుంచి బయటకు లాగేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు. ఈ వీడియో క్లిప్ అసంపూర్తిగా ముగియడంతో ఆ పామును సదరు డాక్టర్ బయటకు తీశాడా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. అసలు పాము చెవి లోపలకి ఎలా వెళ్లిందా? అన్నదే ఇక్కడ అంతుపట్టడం లేదు. అలాగే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో అన్న వివరాలు కూడా తెలియరాలేదు.
Unfortunately,a small snake entered in the ear of a girl#Viral#video pic.twitter.com/EvzrdR7PSC
— Sofiullah (@Sofiull28128257) September 8, 2022
ఇప్పటికే సుమారు లక్ష మంది ఈ వీడియోను వీక్షించారు. ‘మహిళ పడుకొని ఉన్నప్పుడు లోపలికి వెళ్లిండొచ్చు’ అని కొందరు కామెంట్ చేస్తుండగా, ఫేక్ వీడియో అని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఈ వీడియోపై.. మీ ఓ లుక్కేసి నిజామా? కాదా? అన్నది కామెంట్ల రూపంలో తెలియజేయండి.