తల్లి బిడ్డల ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలే తన సర్వస్వం అనుకుని జీవిస్తుంది అమ్మ. ఎప్పుడైన పొరపాటున క్షణకాలం పాటు తల్లీబిడ్డలు ఒక్కరికొకరు కనిపించకపోతే ఎంతో ఆవేదన చెందుతారు. అయితే ప్రేమ, బాధలు కేవలం మనషుల్లోనే కాదు.. భూమి మీద ఉన్న ప్రతి జీవిలోను కనిపిస్తోంది. మనషులు అయితే తమ భావాలను మాటల్లో చూపిస్తారు. అదే మూగ జీవాలు అయితే చేతల్లో చూపిస్తాయి. ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూశాం. అయితే తాజాగా తన అమ్మ కోసం ఓ పిల్ల గుర్రం పడిన ఆరాటం అందరికి కంటనీరు తెప్పించింది. బొమ్మే తన అమ్మ అనుకుని ఆ బస్సు వెనక గుర్రం పరుగు తీసింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ గుర్రానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులో కోయంబత్తూరులోని పట్టీశ్వర దేవాలయం సమీపంలోని దర్పణ మండపం, పడితూర్ అనే ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ 10పైగా గుర్రాలు తిరుగుతున్నాయి. ఆ ప్రాంతలోనే గడ్డి మేస్తూ జీవిస్తున్నాయి. అయితే వారం క్రితం ఆ గుంపులో నుంచి ఓ గుర్రం పిల్ల తప్పిపోయింది. తల్లి కోసం వెతుకుంటూ ఆ ప్రాంతం అంతా తిరిగింది. అయితే తన తల్లి ఎక్కడ కనిపించలేదు. ఇక అదే ప్రాంతంలో గడ్డి మేస్తూ తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇదే సందర్భంలో ఓ బస్సుపై ఉన్న గుర్రపు బొమ్మను ఈ పిల్ల గుర్రం చూసింది. దీంతో ఆ బోమ్మే.. తన తల్లి అని అనుకుని.. ఆ బస్సు వద్ద అటూ ఇటూ తిరిగింది. అయితే ఇంతలో ఆ బస్సు స్టార్ అయి.. ముందుకు కదిలింది. పాపం.. ఆ పిల్ల గుర్రం తన తల్లి పరిగెత్తుతుందనే భావనతో బస్సు వెనకు పరుగు తీసింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన వారంత కంటతడి పెట్టుకున్నారు. ముఖ్యంగా జంతు ప్రేమికులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఇటీవల తాము చూసిన బెస్ట్ ఎమోషనల్ వీడియో ఇదేనంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. మరి.. ఈ వీడియోపై మీరు.. ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.