బహుళ అంతస్థుల భవనాలు, ఆఫీసులు, ఆసుపత్రుల్లో లిఫ్ట్ ఉంటాయి. వీటి ద్వారానే అపార్ట్ మెంట్ లోని వాళ్లు రాకపోకలు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ లిఫ్ట్ లు సాంకేతిక కారణంతో మధ్యలో ఆగిపోతుంటాయి. సరైన నిర్వహణ లేకపోవడం, ఇతర కారణాలతో అప్పుడప్పుడు వీటిల్లో చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కొల్పోతుంటారు. తాజాగా 17 సెకన్లు ఉండే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఎవరికైన ఒంట్లో వణుకు పుట్టాల్సిందే. ఈ వీడియో చూస్తే లిఫ్ట్ ఎక్కాలంటే భయపడేలా ఉంది. ఓ రోగిని స్ట్రైచర్ పై లిఫ్ట్ ద్వారా తీసుకెళ్తున్న క్రమంలో పూర్తిగా లోపలకి వెళ్లక ముందే అది కిందకి వెళ్లిపోయింది. దీంతో రోగి, మరో ఆసుపత్రి సిబ్బంది అందులో చిక్కుకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రతి ఒక్కరు ఏదో ఓ సందర్భంలో లిఫ్ట్ ఎక్కే ఉంటాము. ఆఫీసుల్లో, అపార్టమెంట్స్ ల్లో, ఆసుపత్రుల్లో రోజూ లిఫ్ట్ ను ఉపయోగిస్తుంటాము. బహుళ అంతస్థుల భవనాలలో ఎవరైనా పైన అంతస్తులకు వెళ్లాలన్నా, దిగాలన్నా లిఫ్ట్ ఉపయోగిస్తుంటారు. లిఫ్ట్ లేకుండా మెట్లు ద్వారా ఎక్కాలంటే.. చాలా కష్టమవుతుంది. అయితే ఈ వీడియో చూశాక మాత్రం.. ఇంకోసారి లిఫ్ట్ ఎక్కాలంటే భయపడతారు. లిఫ్ట్ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన తర్వాత ఎక్కువ మందిలో వణుకు పుడుతుంది. ఇక వీడియోలో.. ఒక రోగిని స్ట్రైచర్ పై ఆసుపత్రి సిబ్బంది లిఫ్ట్ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ లిఫ్ట్ వచ్చి ఆగిన తరువాత డోరు ఓపెన్ చేసి మొదట ఓ సిబ్బంది లోపలికి వెళ్లాడు. బయట ఉన్న మరొక సిబ్బంది రోగి స్ట్రెచర్‌ను లోపలికి అడ్జెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లోపల లిఫ్ట్‌లోకి సాంకేతిక లోపం ఏమైన తలెత్తిందేమో తెలియదు.
ఎటువంటి బటన్స్ నొక్కకుండానే.. కిందకు వెళ్లడం ప్రారంభించింది. అప్పటికి స్ట్రెచర్ పూర్తిగా లోపలికి వెళ్లలేదు. ఈక్రమంలోనే లిఫ్ట్ కిందకి వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న రోగి బంధువుతో పాటు ఆస్పత్రి సిబ్బంది క్షణం పాటు షాక్‌కు గురయ్యారు. అలా ఊహించని విధంగా లిఫ్ట్‌లో రోగి, ఆసుపత్రి సిబ్బంది లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. అయితే వీడియోలో అంత వరకు మాత్రమే కనిపిస్తోంది. ఆ తరువాత ఏం జరిగిందనే సమాచారం మాత్రం తెలియరాలేదు. ఈ ప్రమాదంలో లిఫ్ట్ లోపల ఇరుక్కుపోయిన వారికి ఏమైనా గాయాలు అయ్యాయా? అనే విషయంపై సమాచారం రాలేదు. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం షాక్‌కు గురవుతున్నారు. సరైన మెయింటనెన్స్ లేకపోతే.. లిఫ్ట్స్ ద్వారా ఇలాంటి పెను ప్రమాదాలు సంభవిస్తాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Ye kaise hua ?😢😢😢😢😢
Pray that the patient and staff are safe ?
Unsafe #Elevator pic.twitter.com/wF9k3DPlz0
— Rupin Sharma (@rupin1992) October 11, 2022