ఎన్నికలు వస్తే చాలు.. ప్రతి రాజకీయ పార్టీ పెద్ద సంఖ్యలో హామీలు ఇస్తుంది. తాము అధికారంలోకి వస్తే.. అవి చేస్తామని, ఇవి చేస్తామని, ఏవేవో ఉచితంగా ఇస్తామని చెబుతుంటాయి. ఒక పార్టీకి మించి మరొక పార్టీ అనేక ఉచిత హామీలు ఇస్తుంటాయి. అవి అమలు చేయగలమా? లేదా? అనే విషయాన్ని మరచి.. భారీగా హామీలు ఇస్తుంటాయి. ఇది కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాదు. జిల్లా, మండల స్థాయిలో కూడా ఉంటాయి. అయితే రాష్ట్ర స్థాయిలో పార్టీలు ఇచ్చే పథకాలు, హామీలు వేరే ఉంటాయి. మండల స్థాయిలో ఇచ్చే హామీలు మరొరకంగా ఉంటాయి. అయితే కొందరు అత్యుత్సాహంతో సర్పంచి పదవి కోసం కూడా తీవ్రంగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో రాష్ట్ర, దేశ స్థాయిని మించిపోయేలా హమీలు ఇస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి సర్పంచి పదవి కోసం ఇచ్చిన హామీలకు అందరూ అవాకయ్యారు. తాను సర్పంచిగా గెలిస్తే.. రూ100 రూపాయలకే సిలిండర్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. దీనితో పాటు మరికొన్ని షాకయ్యే హామీలు ఇచ్చారు.
హర్యానా రాష్ట్రంలోని సిర్సద్ అనే గ్రామంలో సర్పంచి ఎన్నికల సందడి నెలకొంది. ఈ పోటీల్లో బైకరణ్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నట్లు సమాచారం. అయితే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అతడు మైండ్ బ్లాకయ్యే హమీలను ప్రకటించాడు. బైకరణ్ ఎన్నికల ప్రచార పోస్టర్ లో ఓ రేంజ్ లో హామీల వర్షం కురిపించాడు. ఎవరైనా సరే.. అతడి హామీలకు టెంప్ట్ అవాల్సిందే. అతడు ఎన్నిక ప్రచార పోస్టర్ లో రూ.20కే లీటర్ పెట్రల్, రూ.100కే సిలిండర్, గ్రామంలో ఫ్రీ వైఫై కుటుంబానికి ఓ ఉచిత బైక్ ఇస్తానని ప్రకటించాడు. అంతే కాక తాను సర్పంచిగా గెలిస్తే.. ఆడవారికి మేకప్ కిట్, రోజుకు ఒక లిక్కర్ బాటిల్, గ్రామం చుట్టూ 3 ఎయిర్ పోర్టులు, 10 కి.మీ దూరంలోని గ్రామానికి ప్రతి 5 నిమిషాలకో హెలికాప్టర్ సౌకర్యం కల్పిస్తానని అతడు పేర్కొనాడు. ప్రస్తుతం ఈ హామీల ప్రకట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి ప్రచార పోస్టర్ చూసి.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇతడు కచ్చితంగా ప్రధాని అవుతాడని కొందరు, పాపం.. అతడి మానసిక స్థితి బాగాలేనట్లుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Am shifting to this village 🤣 pic.twitter.com/fsfrjxbdLc
— Arun Bothra 🇮🇳 (@arunbothra) October 9, 2022