పిల్లలు దేవుళ్లతో సమానం అని పెద్దలు అంటుంటారు. ఎందుకంటే వారికి దేవుళ్ల మాదిరి రాగ, ద్వేష, అసూయ వంటి చెడు గుణాలు ఉండవు. కేవలం అల్లరి చేయడం మాత్రమే వారి తెలుసు. ఈ అల్లరితనం అనేది ఇంట్లోనే కాక స్కూల్ సైతం చేస్తుంటారు. అయితే ఇంట్లో తల్లిదండ్రులు భరిస్తారు. కానీ పాఠశాలలో కొందరు టీచర్లు కోపం ప్రదర్శిస్తుంటారు. అయితే మరికొందరు టీచర్లు మాత్రం పిల్లలను ప్రేమతో తమ దారిలోకి తెచ్చుకుంటారు. అలాంటి వారంటే పిల్లలకు చాలా ఇష్టం. అలాంటి టీచర్లు మాట్లాడకపోతే ఈ పిల్లలు బాధపడతారు. తాజాగా ఓ బుడ్డొడు అలానే బాధపడ్డాడు. టీచర్ తనతో మాట్లాడటంలేదని ఆమె వద్దకు వెళ్లి అల్లరి చేయను అంటూ ఆమెను బ్రతిమిలాడాడు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
వీడియో లో క్లాస్ రూమ్ లో బాలుడు అల్లరి చేయగా.. ఆ పిల్లాడితో టీచర్ మాట్లాడకుండా కూర్చుంది. దీంతో టీచర్ ని మాట్లాడాలని అడుగుతాడు. అయినా ఆమె మౌనంగా ఉంటుంది. అతని మాటలు నమ్మనని అని టీచర్ అంటుంది. “లేదు.. మిస్ నేను అల్లరి చేయను” అంటూ ఆమె చేతిలో చేయి వేసి మాట ఇస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. “మా స్కూల్ లో తప్పులు చేస్తే బెత్తంతో కొట్టడమే తప్ప..ఇలా వేరైటీ శిక్ష వేయలేదు. ఇలాంటి అవకాశం మాకు ఇచ్చి ఉంటే ఎంతో బాగుండేదో. మాకెందుకు జరగలేదు” అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.