ఐకాన్ స్టార్ అల్లు అర్జున్– సుకుమార్ క్రేజీ కాంబోలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా సినిమా దేశవ్యాప్తంగా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఒక పిరియడ్ వరకు పుష్ప మేనియా నడిచింది. ఎక్కడ చూసినా పుష్ప స్టెప్పులు, డైలాగులే కనిపించేవి. ఎవరిని కదలించినా తగ్గేదేలే అంటూ డైలాగులేశారు. సెలబ్రిటీలు, క్రికెటర్లే కాదు.. రాజకీయ నాయకులు కూడా పుష్పరాజ్ డైలాగులు వల్లె వేశారు. అబ్బో ఒకటా రెండా దేశం మొత్తం పుష్ప దెబ్బకు ఊగిపోయింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం క్లిక్ చేయండి.
తాజాగా ఓ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన బుడ్డోడు చెయ్యి గడ్డం కింద నుంచి అచ్చు పుష్పరాజ్ లా కదిలించాడు. ఇంకేముంది అచ్చు అల్లు అర్జున్ లా తగ్గేదేలే అంటున్నాడుగా అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇంకేముంది కొద్దిసేపటికే అది వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు కడుపుతో ఉన్నప్పుడు వాళ్ల అమ్మ పుష్ప సినిమా చూసిందేమో? అనే అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. ఈ విషయాన్ని యాధృచ్ఛికమే అని కొందరు అంటున్నా కూడా తగ్గేదేలే అనుకుంటే తప్పేంటని మరికొందరు సమర్థిస్తున్నారు. మరి, ఆ వైరల్ వీడియో మీరూ చూసేయండి. ఆ బుడ్డోడి చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.