కొన్ని కొన్ని ఘటనలు చూసినప్పుడు దేవుడే ఆ మనిషి రూపంలో వచ్చి రక్షించాడు అనే భావనం కలుగుతోంది. తాజాగా నెలల పసికందు. ఊపిరి అందక ప్రాణాలతో కొట్టు మిట్టాడుతుంది. ఇదే సమయంలో ఆక్సిజన్ మెషిన్ ద్వారా గాలి అందిచాలని భావించారు అక్కడి వైద్యులు. అయితే ఆక్సిజన్ మెషిన్ కూడా పనిచేయలేదు. దీంతో కొన ఊపిరితో ఉన్న ఆ చిన్నారికి నోట్లోకి నోరు పెట్టి గాలి ఊది ఆ చిన్నారిని బ్రతికించింది ఓ మహిళ వైద్యురాలు. దాదాపు ఏడు నిమిషాల పాటు చిన్నారికి నోట్లో నోరు పెట్టి గాలి అందించింది. గతంలో జరిగిన ఈ ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోచోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఖుబ్బూ అనే మహిళ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ పాప పుట్టిన కొన్నిగంటలకు ఆక్సిజన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు అక్కడి వైద్యులు గ్రహించారు. దీంతో వెంటనే ఆ పసి బిడ్డకి ఆక్సిజన్ అందించాలని ఆక్సిజన్ మెషిన్ తెప్పించారు. అయితే ఆ మెషిన్ పనిచేయలేదు. దీంతో కొద్ది సేపు ఏం చేయాలో వారికి పాలుపోలేదు. పాప స్థితి క్షణ క్షణానికి విషమిస్తోంది. దీంతో వెంటనే అక్కడే ఉన్న సురేఖ చౌదరి అనే మహిళ వైద్యురాలు స్వయంగా చిన్నారి నోటిలో నోరు పెట్టి ఊపిరి అందించింది. అలా ఏడు నిమిషాల పాటు ఆ చిన్నారికి గాలి అందించింది.దీంతో కొద్ది సమయం తర్వాత పాపలో కదలికలు మొదలై.. ఏడుపులు పెట్టింది.
దీంతో తల్లిదండ్రులతో పాటు ఆస్పత్రి సిబ్బంది సంతోషంలో మునిగి తేలారు ప్రస్తుతం ఈ వైద్యులరాలికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలోనూ తాను చాలామంది చిన్నారులను ఇదే విధంగా కాపాడినట్లు సురేఖ చౌదరి తెలిపారు. తనకు ఇదే పెద్ద విజయమని ఆమె తెలిపారు. ఆ మహిళ వైద్యు రాలిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. దేవుడికి రూపమే ఆ డాక్టరమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈవీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
डॉक्टर सुलेखा चौधरी, पीडियाट्रीसियन, CHC, आगरा।
बच्ची का जन्म हुआ लेकिन शरीर में कोई हलचल नहीं थी।
बच्ची को पहले ऑक्सिजन सपोर्ट दिया, लेकिन जब उससे भी लाभ नहीं हुआ तो लगभग 7 मिनट तक ‘माउथ टू माउथ रेस्पिरेशन’ दिया, बच्ची में साँस आ गई।👏🏼❤️#Salute #Doctor #respect pic.twitter.com/1PQK8aiJXQ— SACHIN KAUSHIK (@upcopsachin) September 21, 2022