Viral Video: బుద్ధిగా చదువుకుని, సక్రమ మార్గంలో నడవాల్సిన యువత తప్పుదోవ పడుతోంది. చదువుకోవటానికి వెళ్లిన చోటే కొందరు యువతీ, యువకులు గొడవలు పడుతున్నారు. చావు అంచుల వరకు వెళ్లి వస్తున్నారు. బంగారు బాట వేసుకోవాల్సిన భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తాజాగా, కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ నడిరోడ్డుపై గొడవ పెట్టుకున్నారు. దారుణంగా కొట్టుకున్నారు. ఓ కారు వచ్చి ఓ ఇద్దర్ని ఢీకొట్టినా ఆ యువకులు గొడవ ఆపలేదు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవను సద్దుమణిగించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్‌కు చెందిన కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ నడిరోడ్డుపై గొడవకు దిగారు. రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఉన్నారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ పెరిగిపోసాగింది. అయినా వాళ్లు పట్టించుకోలేదు. గొడవపడుతూనే ఉన్నారు. కొద్ది సేపటి తర్వాత ఓ కారు స్పీడుగా వారి వైపు దూసుకు రాసాగింది. ఇది గమనించిన యువకుల గుంపు చెల్లాచెదురైంది. అయినప్పటికి ఓ ఇద్దరు వ్యక్తులు మాత్రం గొడవ పడుతూనే ఉన్నారు. ఇంతలో ఆ కారు ఆ ఇద్దర్నీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ గాల్లోకి ఎగిరి కిందపడ్డారు
. కొన్ని క్షణాల్లోనే పైకి లేచారు. ఓ వ్యక్తి పైకిలేచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోవటానికి చూశాడు. కానీ, ఇంతలో మరో వ్యక్తి అతడ్ని కొట్టుకుంటూ పక్కకు తీసుకెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత ఓ పోలీసు అక్కడికి వచ్చాడు. గొడవపడుతున్న ఓ వ్యక్తిని పట్టుకున్నాడు. మరో వ్యక్తిపై గట్టిగా కేకలు వేశాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సదరు యువకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Peak Ghaziabad. Disturbing video.
A speeding car gate-crashes a brawl. The brawl didn’t stop though. pic.twitter.com/p3qyBf0DKt
— Piyush Rai (@Benarasiyaa) September 21, 2022
ఇవి కూడా చదవండి : వీడియో: ఒంటరి వాడ్ని చేసి అఘాయిత్యం చేసిన అమ్మాయిలు! చొక్కా చింపేసి మరీ..