తమను ఎంతగానో ప్రేమగా పెంచి పోషిస్తున్న యజమాని పట్ల మూగ జీవాలు అభిమానాన్ని, ప్రేమను కలిగి ఉంటాయి. వారు ఆహారం అందించే సమయంలో లేదా ఇంకేదైనా అందిస్తున్నుప్పుడు ఎంతో సంతోషంగా ఉంటాయి. కానీ వారు ఒక పూట కనిపించకపోతే ఆ మూగ జీవాలు తల్లడిల్లిపోతాయి. యజమాని కోసం చుట్టుపక్కల వాటి కళ్లు తెగ వెతుకుతూ ఉంటాయి. కానీ తనను ఎంతగానో ప్రేమగా చూసుకుంటున్న యాజమని చనిపోతే కొన్ని మూగ జీవాలు ఆయన మృతదేహం వెంట పరుగులు తీస్తుంటాయి. మరికొన్ని అయితే దిగులుతో చనిపోతాయి. తాజాగా ఓ ఆవు తన యజమాని మరణించాడని తెలుసుకుని శ్శశానానికి పరుగు పరుగున వచ్చింది. తన యజమాని మృతదేహం వద్దకు వెళ్లి ఆప్యాయంగా తడిమింది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన జార్ఖండ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
జార్ఖండ్‌లో హజారీబాగ్ ప్రాంతానికి ఓ వ్యక్తికి జంతువులు అంటే ఎంతో ప్రాణం. అందుకు కొన్ని పెంపుడు జంతువులను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల ఆ వ్యక్తి మరణించాడు. దీంతో బంధువులు, స్నేహితులు అందరూ అంత్యక్రియల కోసం మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అంత్యక్రియలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో చనిపోయిన వ్యక్తికి చెందిన పశువుల్లోని ఓ ఆవు మరణించిన యజమాని కోసం శ్మాశనం కి వచ్చింది. లేవమన్నట్లు ఆయన మృతదేహాన్ని తడిమింది. ఆ తర్వాత తన యజమాని ఇక తనకు కనిపించడని గ్రహించి కన్నీరు కార్చింది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తుది వీడ్కోలు పలికింది. ఇది చూసి మృతుడి బంధువులు, స్థానికులు ఆశ్చర్యపోయారు. కన్న పిల్లలే నిర్ధాక్షణ్యంగా తల్లిదండ్రులను వదిలేస్తున్న ఈ కాలంలో, కేవలం తనపై కొంచెం ప్రేమ చూపించిన యజమాని కోసం తల్లడిల్లింది ఆ నోరు లేని జీవి. కాగా, ఈ హృదయవిదారక ఘటనను ఒక యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు ఆ మూగజీవి ప్రేమకు చలించిపోయారు. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
झारखंड के हजारीबाग में मालिक की मौत पर श्मशान पहुंचा पालतू बछड़ा; चेहरा देखने के लिए मुंह से हटाता रहा कफन, गांववालों ने बछड़े से करवाया अंतिम संस्कार#Jharkhand #BreakingNews pic.twitter.com/zYLZPGJSjI
— shakti ojha🇮🇳 (@imShaktiojha) September 15, 2022