పెళ్లి.. భారతీయ సనాతన సాంప్రదాయంలో మరచిపోలేని వేడుక. అందుకే ప్రతీ మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురానుభూతి. ఇక తన జీవితంలోకి తాను కోరుకున్న వాడే వరుడుగా వస్తే.. తాను కోరుకున్న ఆనందమే తన కళ్ల ముందు ఉంటే.. ఇక ఆ ఆనందమే తన జీవితాంతం ఉంటుందని తెలిస్తే.. ఆ యువతి సంతోషానికి అవధులుండవ్! ఇక ఆసంతోషాన్ని తట్టుకోలేక ఏకంగా ఆ యువతి పెళ్లి పీటలపైనే వరుడికి ముద్దు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియోనే నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
తల్లిదండ్రులు పెళ్లీడుకొచ్చిన కూతురుకు ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామా అని వేచిచూస్తూంటారు. ఇక పెళ్లి సంబంధాల కోసం.. బంధువులకు, తెలిసిన వారికి ఓ మంచి సంబంధం ఉంటే చూడండి అని చెబుతూంటారు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే.. పెళ్లి అనగానే కొద్దిగా బిడియం.. సిగ్గూ.. భయం.. ఎందుకంటే రాబోయే వాడు.. కాబోయే వాడు ఎలా ఉంటాడో? తనను ఎలా చూసుకుంటాడో అని! అయితే ఇవన్నీ ప్రతీ ఆడపిల్లలో ఉండటం సహజమే. అయితే ఈ క్రమంలోనే ఓ యువతి పెళ్లి కొడుకు తాళి కడుతుంటే.. పట్టలేని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైంది. చప్పట్లు కొడుతూ.. నవ్వుతూ.. తెగ సంతోషపడిపోయింది.. తాళికట్టాక గాఢంగా పెళ్లి కొడుక్కి ముద్దు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అక్కడ తమిళ సంప్రదాయంలో ఓ పెళ్లి జరుగుతోంది. వరుడు తాళి తీసుకుని పెళ్లి కూతురు మెడలో కడుతున్నాడు.. ఇక అప్పుడు ఆ పెళ్లి కూతురు ఆనందానికి హద్దులేదు. ఆనందం తట్టుకోలేక వరుడిపై ముద్దులు కురిపించింది. ఈ వీడియోను ట్వీటర్లో ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. అదీ కాక “మీరు కూడా ఇలాగే ఉంటారా” అని సరదాగా ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్స్ సరదా కామెంట్స్ పెడుతున్నారు. “లవ్ మ్యారేజ్ కాబోలు అందుకే అంత సంతోషంగా ఉంది” అని కొందరంటే..”ఈ మధుర క్షణం కోసం ఎన్ని సంవత్సరాలుగా వేచి చూస్తుందో పాపం” అని మరికొందరు రాసుకొచ్చారు. ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. మరి తెగ సంబంర పడిపోతున్న ఈ పెళ్లి కూతురుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
என்னம்மா இப்படி பண்றிங்களேம்மா😀 pic.twitter.com/GOKCkLOHT6
— செல்வம் அரசுப்பள்ளி ஆசிரியர்.. (@selvachidambara) September 13, 2022