సాధారణంగా సమాజంలో మనకు తెలియని, మనం తెలుసుకోని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను మనం రోజూ చూస్తూనే ఉంటాం కూడా. కానీ మనకు వాటి గురించి తెలీదు. అయితే కొన్ని విషయాలు ఇంటర్నేషనల్ లెవల్లో ఒకటే తీరుగా ఉంటాయి. అలాంటి విషయాల్లో ఒకటి స్కూల్, కాలేజీ బస్సుల కలర్ విషయం. మీరెప్పుడైనా గమనించారా స్కూల్, కాలేజీ బస్సుల కలర్ ఎందుకు పసుపు కలర్ లోనే ఉంటాయి అని. ఇప్పుడు చెప్పగానే అవును నిజమేగా అని మీకు అనిపిస్తుంది కదా! మరి మీరెప్పుడైనా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారా. అయితే సరదాకో, రంగు బాగుంటుంది అనో రంగు వేస్తారు అనుకుంటే మీరు పొరపడ్డట్లే. దీని వెనక ఉన్న శాస్త్రీయ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా స్కూల్, కాలేజీ బస్సులు పసుపు రంగులో ఉండటం మీరు గమనించే ఉంటారు. అయితే మన దేశంలోనే ఇలా బస్సులకు ఎల్లో కలర్ వేస్తారు అనుకుంటే మీరు పొరబడ్డట్లే.. చాలా దేశాల్లో బస్సులకు ఎల్లో కలర్ ను మాత్రమే వాడుతుంటారు. అయితే ఇలా కలర్ వేయడానికి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ప్రతీ కలర్ కు ఒక స్థిరమైన తరంగ ధైర్ఘ్యం ఉంటుంది అని మనం చిన్నప్పుడు స్కూల్ లో చదివే ఉంటాం. అయితే రకరకాల రంగులకు రకరకాల తరంగ ధైర్ఘ్యాలు ఉంటాయి. ఇక కాంతి తరంగ ధైర్ఘ్యం.. రిఫ్లెక్షన్ లపైనే రంగులు ఆధారపడి ఉంటాయి.
ఇక రంగుల అన్నింటిలో కెల్లా పసుపు కలర్ కే ఎక్కువ తరంగ ధైర్ఘ్యం ఉండటంతోనే ఎల్లో కలర్ స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు. మిగిలిన కలర్స్ కంటే ఎల్లో కలర్ 1.24 రెట్లు వేగంగా మన కళ్లను ఆకర్షిస్తుంది. అందుకే చూడానే ఠక్కున కనిపిస్తుంది కాబట్టే స్కూల్ బస్సులకు, కాలేజీ బస్సులకు ఈ కలర్ ను వేస్తారు. మరో విషయం ఏంటంటే.. తక్కువవ వెలుతురులో కూడా పసుపు రంగు స్ఫష్టంగా కనిపిస్తుంది. అదీకాక చీకట్లో, పొగమంచులో, వర్షం కురుస్తున్నప్పుడు కూడా పసుపు రంగును సులభంగా గుర్తించవచ్చు. అందుకే ప్రమాదాల బారిన పడకుండా వాటికి ఈ కలర్ వేస్తారు. ఇక కేవలం స్కూల్, కాలేజీ బస్సులకే కాకుండా పెద్ద యంత్రాలు అయిన జేసీబీలు, క్రేన్స్ లాంటి భారీ యంత్రలకు సైతం పసుపు కలర్ వేయడం మనకు తెలిసిన విషయమే.