ఏ దేశంలోనైనా గ్రామాలు, పట్టణాలు ఉంటాయి. అయితే ఈ రెండు ప్రాంతాల్లో ప్రజల జీవన విధానాల్లో చాలా తేడాలుంటాయి. నగరాల్లో అయితే చదువుకున్నవారు, ఉద్యోగస్తులు, వ్యాపారులు ఉంటారు. గ్రామాల విషయానికొస్తే.. వ్యవసాయదారులు, వృత్తిపనివారు ఉంటారు. దీంతో నగరాల్లో ఉన్నంత అభివృద్ధి, గ్రామాల్లో ఉండదనే చెప్పాలి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆసియా ఖండంలోనే ధనిక గ్రామంగా ఓ గ్రామం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.

మారుతున్న పరిస్థితులు ప్రజల్లో వచ్చే చైతన్యంతో ఇప్పుడు గ్రామాలు కూడా పట్టణాలకు ధీటుగా తయారవుతున్నాయి. గ్రామాల్లో ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడిన వారే ఉంటారు. ఈ రోజుల్లో రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్దతులను అవలంభించి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. దీంతో వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించి కుటుంబాలను వృద్దిలోకి తెచ్చుకుంటున్నారు. గ్రామంలోని వారు వృద్ధిలోకి వస్తే యాదృశ్చికంగా గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇదే కోవకు చెందిన గ్రామం ఒకటి ధనవంతులు, కుభేరులతో ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా పేరుగాంచింది. ఆ గ్రామమే మాధాపర్ ఇది గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఉంది. ఈ గ్రామంలో ఉన్న బ్యాంకుల్లో కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి. ప్రతి నెల లక్షల కొద్ది డబ్బు ఈ బ్యాంకులో జమ అవుతున్నది.
దీనికి గల కారణం ఆ గ్రామానికి చెందిన కుటుంబాల్లోని వారు విదేశాల్లో ఎక్కువగా ఉంటున్నారు. మాధాపర్ విలేజ్ లో పన్నెండు బ్యాంకుల బ్రాంచులున్నాయి. వారికి వచ్చే వేతనాలను ఈ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. అన్ని బ్రాంచుల్లో కలిపి 2,650 కోట్ల డిపాజిట్లు పోగయినట్లు సమాచారం. ఆ కారణం చేత ఈ గ్రామల్లో ధనవంతులు ఎక్కువగా ఉన్నారని తేటతెల్లమైంది. ధనవంతులతో పాటు పేదవారు కూడా ఆ ఊరిలో ఉన్నారు. ఈ గ్రామంలో 1,711 కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నాయి. ఇక్కడ నివసించే వారి దగ్గర చాలా ధనం ఉంది. రాంనగరి, జోగివాస్, సర్వోదయ మైదాన్ మడిల్ ప్రాంతాలల్లో కొందరు మాత్రం పేదలుగా ఉన్నారు. ఈ గ్రామంలో ఒక్క సంఘం కూడా పేదరికంతో లేదు. గ్రామస్తులకు సమృద్ధిగా నీరు, మౌలిక వసతులు కల్పించడంపై ధనవంతులు దృష్టి పెడుతున్నారు. మరి ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని పల్లెలు, గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆశిద్దాం.