బాడీ షేమింగ్, ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ చేసే వారి మీద తెలంగాణ గవర్నర్ తమిళిసై విరుచుకుపడ్డారు. తన గురించి అడ్డగోలు కామెంట్స్ చేస్తే.. నిప్పు కణంలా మారతానంటూ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాలు..
మన సమాజంలో సర్వసాధారణంగా కనిపించే సమస్య బాడీ షేమింగ్. ఓ వ్యక్తి రంగు, రూపును బట్టి వారికి నిక్ నేమ్స్ పెట్టి ఏడిపించడం, విమర్శించడం జరుగుతుంటాయి. చిన్నతనం నుంచే పిల్లల్లో ఈ అలవాటు కనిపిస్తుంది. రాను రాను అది పెరిగి పెద్దది అవుతుంది. ఇక ప్రస్తుతం నడిచేది సోషల్ మీడియా యుగం. మితిమీరిన స్వేచ్ఛ కారణంగా.. ఇతరులను.. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలను విమర్శించడం, ట్రోల్ చేయడం వంటి సంఘటనలు పెరుగుతున్నాయి. ట్రోలింగ్ భారిన పడుతున్న సెలబ్రిటీల్లో మహిళలే అధికంగా ఉంటున్నారు. ట్రోల్స్‌ని కొందరు పట్టించుకోరు.. వారి ఖర్మ అని వదిలేస్తారు. కానీ మరికొందరు మాత్రం తమపై వచ్చే విమర్శలకు ధీటుగా బదులిస్తారు. ఈ జాబితాలోకి వస్తారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. తాజాగా తనను విమర్శించే వారికి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు తమిళిసై. ఆ వివరాలు..
చెన్నైలోని ఓ ప్రైవేట్ బాలికల పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్న తమిళిసై తనను విమర్శించే వారిపై విరుచుకుపడ్డారు. బాడీ షేమింగ్ చేసే వాళ్లకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘నేను నల్లగా ఉన్నానంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. నన్ను నల్లగా ఉన్నాను అంటే అగ్గిలా మారతాను. నన్ను విమర్శించే వారు ఊహించని స్థాయికి ఎదుగుతాను. అడ్డగోలు కామెంట్స్ చేస్తే చూస్తూ ఊరుకోను.. నిప్పు కణంలా మారతాను’’ అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోయే శాడిస్టులకు తమిళిసై ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. మరి బాడీ షేమింగ్‌పై గవర్నర్ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.