80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇక నియామక ప్రక్రియలో భారీగా మార్పులు తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కొత్త జోనల్ విధానంతో.. స్థానికులకు మెజారిటీ సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఆ వివరాలు..
గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇప్పటి వరకు ఇంటర్వ్యూలు ఉండేవి. గ్రూప్-1 కు సంబంధించి ఇంటర్వ్యూలకు 100 మార్కులు, గ్రూప్-2కు సంబంధించి 75 మార్కులు ఉన్నాయి. అయితే.. ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచి ఇంటర్వ్యూల విధానంలో తీవ్ర విమర్శలు, అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్వ్యూల కారణంగా అవినీతి జరుగుతుదని.. అనేక మంది ప్రతిభ కలిగిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలను రద్దు చేయాలన్న డిమాండ్ ఏళ్లుగా ఉంది. ఏపీ సర్కార్ ఇప్పటికే ఇంటర్వ్యూలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: నేను చాలా శక్తివంతురాలిని.. ఎవరి ముందు తలవంచేది లేదు: తమిళిసైతాజాగా తెలంగాణలోని సీఎం కేసీఆర్ సర్కార్ కూడా ఇంటర్వ్యూలను రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే ఈ ఫైల్ ను సీఎం కేసీఆర్ వద్దకు అధికారులు పంపించినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ నుంచి ఈ ఫైల్ కు ఆమోద మద్ర లభించనున్నట్లు అధికార వర్గాల నుంచి సమాచారం. సీఎం నుంచి ఆమోదం లభించిన తర్వాతనే గ్రూప్స్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ప్రజల్లో సిట్టింగులపై అసంతృప్తి.. మెజార్టీ ఎమ్మెల్యేలకు టిక్కెట్ లేనట్లేనా?..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.