ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్ వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు సజీవ దహనం అవుతున్నారు. మరికొందరు కాలిన గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. తాజాగా సుర్యాపేట జిల్లాలో ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్ వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు సజీవ దహనం అవుతున్నారు. మరికొందరు కాలిన గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటీవలే సికింద్రాబాద్ లోని స్వప్న కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం జరిగి.. ఆరు మంది మృతి చెందారు. అలానే అకస్మాత్తుగా వాహనాల్లో మంటలు చేలరేగి ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా సూర్యపేట జిల్లాలో ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వేసవి కాలం ప్రారంభం కాక ముందే అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. అలానే కేవలం భవనాల్లోనే కాకుండా వాహనాల్లో సైతం అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. గతంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లు దగ్ధమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో కొందరు మరణించగా, పలువురు గాయాలతో బయట పడ్డారు. అలానే బస్సుల్లో కూడా అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
తాజాగా సూర్యాపేట జిల్లాలో టీఎస్ ఆర్టీసీకి చెందిన రాజధాని బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా రాజధాని బస్సులో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన సుర్యాపేటలో జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న రాజధాని బస్సు సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్ రోడ్డుకు చేరుకోగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కేకలు వేస్తూ బస్సు నుంచి కిందకు దిగి దూరంగా పరుగులు తీశారు. వారు చూస్తుండగానే క్షణాల్లోనే బస్సు అగ్నికి ఆహుతైంది. అయితే ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అందరూ సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బస్సు దగ్ధమవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.