మరికొన్ని రోజుల్లో.. 2022 ముగియనుంది.. నూతన సంవత్సరం 2023 ప్రారంభం కానుంది. ఇక నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్.. న్యూఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అది కూడా ఎవరు ఊహించని రేంజ్‌లో. ఇంతకు ఏంటా గిఫ్ట్ అంటే.. జనాల ఖాతాల్లో లక్ష రూపాయలు జమ చేయనున్నారు. ఏంటి.. ఇది మరో కొత్త పథకమా.. ఎలా అప్లై చేయాలి.. ఎవరు అర్హులు అని ఆలోచిస్తున్నారా.. అయితే ఆగండి.. ముందు ఈవార్త పూర్తిగా చదవండి. 2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా.. న్యూఇయర్ సందర్భంగా రైతులకు శభవార్త చెప్పబోతున్నారు సీఎం కేసీఆర్.
2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హమీల్లో.. పెండింగ్‌లో ఉన్న లక్ష రూపాయల వరకు రుణ మాఫీని నూతన సంవత్సరంలో అమలు చేయబోతున్నారు సీఎం కేసీఆర్. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, రూ.1 లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. దానిలో భాగంగా.. ఇప్పటికే మొదటి దశలో 25,000 రూపాయలు.. రెండోదశలో భాగంగా 50,000 రూపాయల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఇక 2023 జనవరి జనవరి నుంచి రెండు దశల్లో రూ.75,000, లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేయాలని సీఎం నిర్ణయించారు.
రుణమాఫీ పథకంలో బోగస్ హక్కుదారులను తొలగించడం కోసం ప్రభుత్వం.. ఆధార్ లింకు, పట్టాదార్ పాసు పుస్తకాలు, రేషన్ కార్డుల క్రాస్ చెకింగ్ తీసుకువచ్చింది. దీని ద్వారా బోగస్ హక్కుదారులను తొలగించడం వల్ల రుణమాఫీ పథకం అమలు కోసం.. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా తగ్గింది. ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా.. ఆధార్ అనుసంధానం చేసి.. ఒకే కుటుంబంలో ఎక్కువ రుణాలు తీసుకునే వారిని గుర్తించింది. ఆ తర్వాత.. వారిని ‘ఒక కుటుంబం – ఒక లబ్ధిదారుడు’ అనే పంట రుణమాఫీ పథకం ప్రకారం లబ్ధిదారుల జాబితా నుంచి అధికారులు తొలగించారు.
ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా.. కొన్ని సందర్భాల్లో ఎక్కువ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారిని కూడా గుర్తించారు. వారిని కూడా లబ్ధిదారుల జాబితాలోంచి తొలగించారు. ఇలా ఇప్పటి వరకు వివిధ బ్యాంకుల్లో.. లోన్ తీసుకున్న సుమారు 10 లక్షలకుపైగా రుణ దరఖాస్తు దారులను గుర్తించిన.. అధికారులు.. వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. దీని వల్ల రుణమాఫీ మొదటి, రెండు దశల్లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ. 4,000 కోట్లు ఆదా అయ్యాయి. అయితే ఈ నూతన సంవత్సరం సందర్భంగా మూడు, నాలుగో దశ రైతు పంట రుణమాఫీలను ప్రభుత్వం మాఫీ చేయబోతోంది.