శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణ రంగమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ అనే కొత్త ఆర్మీ నియామకాల పద్ధతిని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు స్టేషన్ ను ముట్టడించిన సంగతి తెలిసిందే. స్టేషన్ లోని ఫర్నిచర్ , షాపులను ధ్వంసం చేసి, పట్టాలపై ఆగి ఉన్న మూడు రైళ్లకు నిప్పులు పెట్టారు. ఈ క్రమంలో ఆందోళన కారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సికింద్రాబాద్ స్టేషన్ అగ్నిగుండాన్ని తలపించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ,13 మందికి గాయాలయ్యాయి. అయితే ఈ దాడి వెనక ఉన్న సంచనల విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసంపై హైదరాబాద్ పోలీసులు దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా కుట్ర కోణం వుందన్న ప్రచారం నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించారు. ఈక్రమంలో దాడి వెనుక ఉన్న కొన్ని విషయాలు బయటకి వచ్చాయి. ప్రైవేటు అకాడమీల సహకారంతోనే విద్యార్థులు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులకు ఉండేదుకు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తేల్చారు. ఓ ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఆర్మీ విద్యార్థులు రైల్వేస్టేషన్‌కి వచ్చినట్లు పోలీసుల విచారణంలో తేలింది.
ఇదీ చదవండి: Agnipath: ఏపీలోనూ అగ్నిపథ్ ఆందోళనలు! విశాఖ రైల్వేస్టేషన్ క్లోజ్!
ఇదీ చదవండి: Secunderabad: దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సికింద్రాబద్ అల్లర్లు!
విద్యార్థులకు వాటర్ బాటిల్‌లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను ప్రైవేటు ఆర్మీ కోచింగ్ అకాడమీలు సప్లయ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 10 ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ దాడి వెనుక ఉన్న మరిన్ని విషయాలను రాబట్టేందు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం ఏమైనా ఉందా? అనే దానిపై కూడా విచారణ చేస్తున్నారు. మరి.. ఈఘటనకు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.