హైదరాబాద్ కి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్ లో భారీ వర్షాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. రాత్రి నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. రోడ్లపై వరద నీరు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు మునిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి.
రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ లు జారీ చేసింది. వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లా మోరంచపల్లి గ్రామం వరద నీటిలో చిక్కుకుంది. ఎటు చూసినా వీధులు, రోడ్లు నీట మునిగాయి. మోరంచ వాగు ఉధృతంగా ప్రవహించడంతో మోరంచపల్లి గ్రామం మొత్తం నీట మునిగింది.
దీంతో బుధవారం రాత్రి నుంచి ఇళ్లలోకి నీరు చేరడంతో బిల్డింగ్ లు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మహబూబ్ నగర్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లోని ఎల్బీనగర్, హయత్ నగర్, దిల్ షుక్ నగర్, కోటి, మలక్ పేట్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి జోన్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరవాసులంతా అప్రమత్తంగా ఉండాలని.. అనవసరంగా బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని.. విద్యుత్, నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పలు చోట్ల డ్రైనేజీ సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.