హైదరాబాద్.. గ్లోబల్ సిటీ కావడంతో దేశ నలుమూలల నుంచి ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి జనాభా వస్తోన్నారు. దాంతో విపరీతంగా జనాభా రద్దీతో పాటు ట్రాఫిక్ కూడా పెరిగింది. ఈ రద్దీని మెట్రో రైలు చాలా వరకు తగ్గిస్తోంది. పట్టణంలో మెట్రో రైలు ప్రారంభం అయినప్పటి నుంచి ట్రాఫిక్ కష్టాలు తగ్గాయనే చెప్పాలి. ఈ క్రమంలోనే మెట్రో ప్రయాణికుల పాలిట వరంగా మారింది. రోజూ కొన్ని లక్షల మందిని తమ తమ గమ్యాస్థానాలకు చేరుస్తోంది. తాజాగా మెట్రో ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పారు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పారు అధికారులు. మెట్రో రైలు పని వేళలు పెంచుతూ.. నిర్ణయం తీసుకున్నట్లు హైద్రాబాద్ మెట్రో రైలు MD ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం రాత్రి 10.15 గంటల వరకే నడిచే మెట్రో రైలు.. ఈ నెల 10వ తారీఖు నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో అందుబాటులో ఉంటుంది. అంటే చివరి మెట్రో రైలు టర్మినల్ స్టేషన్ లో రాత్రి 11 గంటలకు స్టార్ట్ అవుతుందన్నమాట. అలాగే రోజూ ఉదయం ప్రారంభం అయ్యే టైమ్ కే.. అంటే ఉదయం 6 గంటలకు మెట్రో రైలు సేవలు ప్రారంభం అవుతాయి. ప్రయాణికుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎండీ పేర్కొన్నారు. తాజాగా మెట్రో అధికారులు తీసుకున్నా నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.