రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక సందర్భాల సందర్భంగా మందు షాపులు మూసేస్తుంటారు. ఇక తాజాగా రానున్న రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఎందుకు.. ఎక్కడ ఇది అమల్లోకి వస్తుంది అంటే..
మందుబాబులకు బ్యాడ్ న్యూస్ అనే వార్త చూడగానే చాలా మంది గుండెల్లో రాయి పడ్డట్లు ఫీలయి ఉంటారు. వామ్మో ఏం వార్త.. కొంపదీసి.. మందు బ్యాన్ చేయడం లేదు కదా అనే అనుమానం వస్తుంది. అది కూడా కొన్ని సెకన్లు మాత్రమే ఉంటుంది. వెంటనే తేరుకుని.. అయినా మేం లేకపోతే ప్రభుత్వాలే లేవు. మందు బ్యాన్ చేసి ఈ ప్రభుత్వాలు నడవగలవా అని తమను తామే మెచ్చుకుంటారు. మరి బ్యాడ్ న్యూస్ ఏంటబ్బా.. ఇప్పుడేం గాంధీ జయంతి కూడా కాదు కదా.. ఎన్నికలు లేవు.. మరి ఎందుకు మాకు బ్యాడ్ న్యూస్ అని ఆలోచిస్తుంటారు. ఇంతకు ఆ బ్యాడ్ న్యూస్ ఏంటో అని తెగ గింజుకుంటూ ఉంటారు. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. రెండో రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. వామ్మో రెండు రోజులా.. ఎందుకు.. అనే వివరాలు తెలియాలంటే.. ఇది చదవండి.
సాధారణంగా ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ రోజున, గాంధీ జయంతి మిగతా మరి కొన్ని రోజుల్లో రాష్ట్రంలో మద్యం దుకాణాలు బంద్ చేస్తారు. అలానే హోలీ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మందు షాపులు బంద్ కానున్నాయి. జంటనగరాల్లోనే కాక.. రాష్ట్రవ్యాప్తంగా హోలీ పండుగను ఎంత సంబరంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా కారణంగా కొన్ని ఏళ్లుగా హోలీ కళ తప్పింది. ఈ ఏడాది ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో.. ఎంతో జోష్‌గా పండుగ చేసుకోవడానికి జనాలు రెడీ అవుతున్నారు. ఇక మధ్యాహ్నం వరకు ప్రజలంతా రంగుల్లో మునిగి తేలుతారు. దీనిలో భాగంగానే హోలీ పండుగను దృష్టిలో ఉంచుకొని పోలీసులు పటిష్ట చర్యలకు రెడీ అయ్యారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదన్న ఉద్దేశంతో హైదరాబాద్‌లోని వైన్స్ షాపులు బంద్ చేయాలని పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో భాగంగానే మార్చిన 6న సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటలకు వరకు మద్యం షాపులను బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ ఆదేశాలు జారీ చేశారు. హోలీ పండుగని దృష్టిలో పెట్టుకుని వైన్స్‌షాపులను క్లోజ్ చేయాలని వైన్ షాప్ ఓనర్స్‌కి సూచించారు. తమ ఆజ్ఞలు కాదని రూల్స్ అతిక్రమిస్తే సదరు వైన్ షాప్ యజమానులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.