రాష్ట్రంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే చోటు హైదరాబాద్ అని అందరికీ తెలిసిన విషయమే. ఎంతో మంది ఈ బిజీ లైఫ్ లో రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ఇకపై రోడ్డు దాటే విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
రాష్ట్రంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే చోటు హైదరాబాద్ అని అందరికీ తెలిసిన విషయమే. ఈ మహా నగరంలో రోడ్డు క్రాస్ చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది. ఎంతో మంది ఈ బిజీ లైఫ్ లో రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటివరకు ఈ సమస్యను ఎవరు గుర్తించకపోవడంతో చాలా మంది ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చూసాము. అయితే ఇప్పుడు ఆ భయం అవసరం లేదని మన పోలీసులు భరోసాని ఇస్తున్నారు. ఇకపై రోడ్డు దాటే విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్ లో రోడ్డు దాటేవారికి ఒక శుభవార్త చెప్పేసారు పోలీసులు. ఎప్పటినుండో ఈ సమస్యతో ఇబ్బంది పడ్డ సామాన్య ప్రజలు ఇకపై పెలికాన్ సిగ్నల్స్ రూపంలో ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సిటీ పోలీసులు కలిసి నగరంలోని పలు చోట్ల పెలికాన్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా.. ట్యాంక్ బండ్ ఏరియాలో ఏర్పాటు చేసిన పెలికాన్ సిగ్నల్‌ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ లాంఛనంగా ప్రారంభించారు. సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ మీద సామాన్య మానవుడికి ఒక అవగాహన ఉంది. గ్రీన్ బటన్ పడితే ముందుకు వెళ్లాలి. రెడ్ బటన్ పడితే ఆగిపోవాలి అనే విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు కొత్తగా పెలికాన్ సిగ్నల్ ని తీసుకొచ్చారు. పెలికాన్ సిగ్నల్స్ అంటే పాదాచారులు సురక్షితంగా ఏర్పాటు చేసిన సిగ్నల్స్. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో పెలికాన్ ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేశారు. వీటిని మాన్యువల్‌గా కంట్రోల్ చేస్తారు.
పెలికాన్ సిస్టం ఏర్పాటుతో ట్రాఫిక్ సిబ్బందితో అవసరం లేకుండా పాదచారులే కాలిబాటలో స్తంభానికి ఏర్పాటు చేసిన సిస్టమ్‌పై బటన్ నొక్కవచ్చు. బటన్ నొక్కగానే అప్పటి వరకు గ్రీన్‌గా ఉన్న సిగ్నల్ రెడ్‌కు మారుతుంది. పాదచారులు రోడ్డు దాటేందుకు వీలుగా ఇది 15 సెకన్ల పాటు ఉంటుంది. ఈ సమయం పూర్తికాగానే దానంతట అదే వాహనాలకు గ్రీన్ సిగ్నల్ చూపుతుంది. అయితే ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వాళ్లు బటన్ నొక్కుండా.. ప్రతీ సిగ్నల్ వద్ద ఒక వలంటీర్‌ను నియమించారు స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్ వద్ద ఉండే ప్రధాన కూడళ్లలో ఈ సిగ్నళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం.. ట్యాంక్‌బండ్ మైత్రీవనం, అమీర్‌పేట్ క్రాస్‌రోడ్స్, బొటానికల్ గార్డెన్ సిగ్నల్, గచ్చిబౌలి, మాదాపూర్, శిల్పారామం జంక్షన్ వంటి ప్రధాన జంక్షన్‌లలో ఈ తరహా సిగ్నల్స్ ఉన్నాయి.