హోటళ్లలో బిర్యానీ తిని పలువురు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే మెదక్ లోని ఓ మండి హోటల్‌లో మటన్ బిర్యానీ తిని పలువురు ఆస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి సంఘటన మరొకటి చోటుచేసుకుంది.
చాలా మంది బిర్యానీ అంటే పడి చస్తారు. వారికి బిర్యానీ లేకుండా ముద్ద దిగదు. ముఖ్యంగా మటన్, చికెన్ బిర్యానీలు తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే హోటళ్లకి, రెస్టారెంట్లకి వెళ్లి మరి.. బిర్యానీని ఆరగిస్తుంటారు. అయితే కొన్ని హోటళ్లలో నాణ్యత లేని బిర్యానీని వినియోగదారులకు సప్లయ్ చేస్తుంటారు. అందుకే తరచూ హోటళ్లో భోజనం చేసిన వారు అస్వస్థతకు గురవుతుంటారు. ఇటీవల మెదక్‌లోని ఓ మండి హోటల్‌లో మటన్ బిర్యానీ తిని పలువురు ఆస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి సంఘటన మరొకటి చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లో సనత్‌నగర్‌లోని మాషా అల్లా హోటల్‌లో మండి తిన్న 12 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారు గురువారం ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం శుక్రవారం కొందరు డిశ్చార్జ్ అయ్యారు. ఆరుగురు డిశ్చార్జ్ కాగా.. మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యంగా నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఆ హోటళ్లో మండి తిన్న తర్వాత వాంతులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు గురయ్యారు. నాణ్యత లేని ఆహారాన్ని సప్లయ్ చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయినట్లు వారు చెబుతున్నారు. అయితే అస్వస్థతకు గురైన 12 మంది అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఆ హోటల్ లో తనిఖీలు చేసి.. సీజ్ చేశారు.
హోటల్ లోని ఆహారం శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపారు. పరీక్షలో వచ్చే రిపోర్టులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఖైరతాబాద్ సర్కిల్ జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ భార్గవ తెలిపారు. ఆ 12 మంది బాధితులు మటన్ బిర్యానీ తిన్నట్లు గుర్తించారు. నాణ్యత లేని ఆహారం వడ్డించే హోటళ్లపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇటీవలే మెదక్ జిల్లా నర్సాపూర్ లోని ఓ హోటలో బిర్యానీ తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఆ ఘటన మరువక ముందే హైదరాబాద్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. హోటళ్లలో ఆహారం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఆహారాన్ని పరిశీలించి తినాలని అధికారులు సూచిస్తున్నారు. మరి.. ఈ ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.