పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. ఆన్‌లైన్ ఈ కామర్స్ సంస్థలు.. భారీ డిస్కౌంట్ ఆఫర్‌లు ప్రకటిస్తాయి. మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, బ్యూటీ ఇలా అన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ప్రకటించి.. కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. ఇక దసరా, దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు అన్ని అన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దీపావళి సందర్భంగా దిగ్గజ ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ.. వివో తన ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు గాను వివో బిగ్ జాయ్ దీపావళి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా కంపెనీకి చెందిన అన్ని ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే కేవలం 101 రూపాయలకే వివో స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకునే బంపరాఫర్‌ని కస్టమర్లకు అందించనుంది. ఆ వివరాలు..
దీపావళి పండుగ సందర్భంగా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో.. ‘బిగ్ జాయ్ దీపావళి’ కార్యక్రమాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా తన వివో ఎక్స్ 80 సిరీస్, వివో వీ 25 సిరీస్, వై75 సిరీస్, వై35 సిరీస్, ఇతర వై సిరీస్ స్మార్ట్ ఫోన్లపై గతంలో ఎన్నడు ఇవ్వనంత భారీ డిస్కౌంటు ఇస్తున్నట్టు తెలిపింది. వివో ఎక్స్ 80 సిరీస్‌పై ఏకంగా రూ.8,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అలానే వివో 25 సిరీస్ ఫోన్లపై రూ.4,000 వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
అలానే ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఇతర బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా అందించే ఈఎంఐలపై కూడా ఈ ప్రయోజనాలు అందిస్తోంది. దానిలో భాగంగా కస్టమర్లు ముందుగా కేవలం రూ. 101 చెల్లించి ఎక్స్, వీ సిరీస్‌లో తమకు నచ్చిన ఫోన్‌ను తీసుకెళ్లొచ్చని ఈ సందర్భంగా వివో ప్రకటించింది. అయితే ఈ ఆఫర్‌లో రూ.101 ప్రారంభంలో చెల్లించి ఆ తర్వాత ఈఎంఐ కట్టాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. దీని గురించి వివో పూర్తి సమాచారాన్ని అందిచాల్సి ఉంది.
అలానే వివో కంపెనీకి చెందిన.. రూ. 15 వేలకు పైన విలువైన ఏ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసినా, ఆరు నెలల అదనపు వారంటీ ఇస్తున్నట్టు తెలిపింది. అలానే వై సిరీస్ ఫోన్లను ఈఎంఐపై తీసుకుంటే.. వాటిపై రూ.2,000 క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్టు పేర్కొంది. అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇక మీరు 101 రూపాయలకే వివో స్మార్ట్ ఫోన్‌ని పొందాలన్నా.. బిగ్ జాయ్ దీపావళికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలన్నా.. వెంటనే మీకు సమీపంలోని వివో రిటైలర్ స్టోర్‌ని సంప్రదించండి.