ఏదైనా పండుగ వస్తుందంటే చాలు ఇ-కామర్స్ సైట్లు ఆఫర్లకు తెరతీయడం కామన్. ఫలానా ఉత్పత్తులపై 50 శాతం తగ్గింపు.. ఫలానా ప్రొడక్ట్స్ పై 60 శాతం వరకు డిస్కౌంట్ అంటూ ఆఫర్లతో వినియోగదారుల్ని ఊరిస్తుంటాయి. సాధారణంగా ఈ సేల్స్ లో చాలా వరకు ఉత్పత్తులను తగ్గింపు ధరకే అందిస్తున్నా.. కొన్ని వస్తువులపై మాత్రం పెద్దగా తగ్గింపు ఉండదు. కానీ వాటినీ తక్కువకే ఇస్తున్నామని ప్రకటించడంతో సేల్స్ లో తక్కువ ధరకే కొన్నామని సంబరపడుతుంటారు కొనుగోలుదారులు. కానీ, అక్కడ జరిగే వాస్తవం వేరు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఉదాహరణకు గతేడాది విడుదలైన ఓ మొబైల్ అప్పట్లో రూ.60 వేలు ఉందనుకుందాం. అయితే, దాన్ని తాజా సేల్స్ రూ.30వేలకే విక్రయిస్తామని చెబుతుంటాయి.. ఇ-కామర్స్ సైట్లు. వాస్తవానికి ఆ ఫోన్ ధర ఓ మూడు నెలల క్రితమే తగ్గించి విక్రయించి ఉండొచ్చు. ఒకవేళ మీరు ఈ సేల్లో ఆ ఫోన్ ను కొనుగోలు చేస్తే.. తక్కువకు ధరకు కొనుగోలు చేశామన్న సంతోషమే తప్ప వాస్తవంగా మీరు డిస్కౌంట్లో కొన్నట్లు కాదు. అలాంటి ఆఫర్లు ప్రస్తుత ‘ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్’, ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’లో లెక్కలేనన్ని ఉన్నాయి. వాటి పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.