Samsung Galaxy M52 5G: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం తప్పనిసరి అయ్యింది. కరోనా కారణంగా విద్యార్థుల చదవులు ఆన్‌లైన్ కావడంతో.. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ దర్శనం ఇస్తుంది. పెరుగుతున్న వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. సరికొత్త ఫీచర్స్, భారీ డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తూ.. వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్ ఫోన్ ధరను భారీగా తగ్గించింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ను అందించారు. దీంతోపాటు ఇందులో పంచ్ హోల్ డిజైన్ కూడా ఉండనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ ధర..
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 నుంచి రూ.20,999కు తగ్గింది. ఈ ఆఫర్ ప్రస్తుతానికి రిలయన్స్ డిజిటల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీంతోపాటు సిటీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.1,500 తగ్గింపు లభించనుంది. అంటే రూ.20 వేలలోపు ధరకే ఈ ఫోన్ కొనేయచ్చన్న మాట. బ్లేజింగ్ బ్లూ, ఐసీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఇది కూడా చదవండి: Gautam Adani: తన పుట్టిన రోజున కీలక నిర్ణయం తీసుకున్న గౌతమ్ అదానీ.. రూ.60వేల కోట్లతో..!
శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్పెసిఫికేషన్లు..
ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ప్లస్ డిస్‌ప్లే అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇది కూడా చదవండి: life insurance: లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. దీంతోపాటు యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో ఉండనున్నాయి. దీని మందం 0.74 సెంటీమీటర్లుగానూ, బరువు 173 గ్రాములుగానూ ఉండనుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Meesho ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 365 రోజులు సెలవు పెట్టినా జీతం ఇస్తారంట!