Samsung Big TV Festival 2022: దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన ‘బిగ్ టీవీ ఫెస్టివల్ సేల్’ను భారత్ వేదికగా మరోసారి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ లో టీవీలు కొనుగోలు చేసిన వారికి ఫోన్లు ఉచితమంటూ వినూత్న ప్రచారం మొదలుపెట్టింది. కొనుగోలు చేసే టీవీలను బట్టి Galaxy S22 Ultra, Galaxy A32, Galaxy A03 మరియు Samsung Slim Fit క్యామ్‌లను ఉచితంగా పొందవచ్చు. ఆ టీవీలేంటో.. ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..
బిగ్-స్క్రీన్ మోడల్స్ అయిన Neo QLED 8K, Neo QLED, QLED, The Frame & Crystal 4K UHD TVలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రతి కొనుగోలుపై గ్యారంటీగా ఉచిత బహుమతులు అందించనుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 31, 2022 వరకు అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్, శాంసంగ్ షాప్స్, మరియు అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. అలాగే.. కొనుగోలు సమయంలో ఐసీఐసీఐ, కొటక్, ఆర్బీఎల్ బ్యాంకుల కార్డ్స్ ఉపయోగించినట్లయితే.. రూ. 20,000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు.
98 ఇంచెస్ Neo QLED 8K
98 ఇంచెస్ Neo QLED 8K TVని కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 1,09,999 విలువైన Galaxy S22 Ultra కాంప్లిమెంటరీగా పొందొచ్చు. దీనిపై ఐదు సంవత్సరాల వారంటీ మరియు 10 సంవత్సరాల నో-స్క్రీన్ బర్న్-ఇన్ వారంటీని కూడా అందిస్తోంది. అలాగే.. 85 ఇంచెస్ మరియు 75 ఇంచెస్ Neo QLED 8K TVలను కొనుగోలు చేసిన వారికి Galaxy S22 అల్ట్రాతో పాటు ఐదేళ్ల వారంటీని అందిస్తోంది.
65 ఇంచెస్ Neo QLED 8K
65 ఇంచెస్ Neo QLED 8K TV కొనుగోలుపై, 85/ 75 /65 /55 ఇంచెస్ Neo QLED TVలు, 85/75 /65 ఇంచెస్ QLED టీవీలు, 75 /85 ఇంచెస్ Crystal 4K UHD TVలు, 75 ఇంచెస్ Frame TVల కొనుగోలుపై రూ. 21,490 విలువైన Galaxy A32ని ఉచితంగా పొందుతారు.
Frame TV/ 55-inch QLED TV
65 ఇంచెస్ Frame TV, 55 ఇంచెస్ QLED టీవీని కొనుగోలు చేసినప్పుడు రూ. 9,499 విలువైన Galaxy A03ని ఉచితంగా పొందుతారు.
వీటితో పాటు.. ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్ 55 ఇంచెస్ QLED TV, 50 ఇంచెస్ Neo QLED టీవీని కొనుగోలు చేస్తే.. రూ. 8,990 విలువైన శాంసంగ్ స్లిమ్ ఫిట్ క్యామ్‌ను కాంప్లిమెంటరీగా పొందుతారు. ఈ ఆఫర్లపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.