Flipkart Big Billion Days Sale: ప్రీమియం స్మార్ట్ ఫోన్ కొనాలనేది మీ కోరికా? ఏదైనా ఆఫర్ ఉన్నపుడు తక్కువ ధరలో అలాంటి ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే.. ఇంకెందుకు ఆలస్యం.. అలాంటి అద్బుతమైన అవకాశం వచ్చేసింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ అందుకు తెరలేపింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా 75 వేల విలువైన శాంసంగ్ ఫోన్ ను 32 వేలకే అందుబాటులోకి తెచ్చింది. ఆ మోడల్ ఏంటి, ఆఫర్ వివరాలేంటి అన్నది ఇప్పుడు చూద్దాం..
దేశంలో పండగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాంలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్ కు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 23 – 30 వరకు ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 జరగనుంది. కాగా, సేల్ కు సమయం దగ్గర పడుతుండదాంతో.. ఫ్లిప్ కార్ట్ సేల్ కు సంబంధించిన డీల్స్ ను ఒక్కొక్కటిగా ప్రకటిస్తోంది. అందులో భాగంగా శాంసంగ్ గ్యాలక్సీ ఎస్21 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
గ్యాలక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ధర, ఆఫర్ వివరాలు:
రూ. 74,999 ధరతో లాంచ్ అయిన ఎస్21 ఎఫ్ఈ 5జీ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో రూ. 31,999 ధరకు అందుబాటులోకి రానుంది. 8జీబీ + 128జీబీ పై ఈ డిస్కౌంట్ ప్రకటించింది. అసలు ధరలో పోలిస్తే.. దాదాపు 57 శాతం తగ్గింపు ఉంది. తక్కువ ధరలో ప్రీమియం ఫోన్ దక్కించుకోవాలనుకునేవారికి ఇదొక సువర్ణావకాశం. బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానుండగా ఎస్21పై ఆఫర్ సెప్టెంబర్ 19 నుంచే అందుబాటులో ఉండనుంది.
Samsung Galaxy S21 FE Price will be Rs.31,999 during #FlipkartBigBillionDays 😀😀😀
— TechGlare Deals (@Tech_glareOffl) September 16, 2022
స్పెసిఫికేషన్స్:
Amma baboi. https://t.co/yJ6Uw8EMAH pic.twitter.com/ocGgsmTJ6p
— KalyanFanatic (@gowrav_pk) September 16, 2022