దేశంలో పండగల సీజన్ సమీపిస్తోంది. దసరా, దీపావళి, క్రిస్మస్.. ఇలా వరుసగా పండుగలు రానున్నాయి. ఈ తరుణంలో ఈ కామర్స్ ప్లాట్‌ఫాంలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్ కు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 23 – 30 వరకు ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 జరగనుంది. కాగా, బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 కు సమయం దగ్గర పడుతుండగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్ కు సంబంధించిన ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఒక్కొక్కటిగా ప్రకటిస్తోంది. అందులో భాగంగా ఐఫోన్ 13పై ఎవరూ ఊహించని ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలు..
49, 990కే ఐఫోన్ 13
గత ఏడాది రూ. 79,900 (128 జీబీ వేరియంట్) ధరతో ఐఫోన్ 13ను లాంచ్ చేశారు. అప్పటినుంచి కూడా అదే ధరతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటోంది. ఒకవేళ ఏవైనా, ప్రత్యేక సేల్స్ ఉన్నప్పుడు ఆఫర్స్ ప్రకటించినా..రూ. 69,900 ధరకు లేదా కార్డు ఆఫర్స్ కలగలిపినా.. రూ. 5,000 నుంచి రూ. 7,000 వరకు మినహా ధర తగ్గేది కాదు. అలాంటి ఐఫోన్ 13 (128 జీబీ) ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో 49, 990కే అందుబాటులో ఉండనుంది. అయితే.. ఈ తగ్గింపులో బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయా? లేదా? అన్న వివరాలు టీజర్‌లో వెల్లడి కాలేదు.
ఐఫోన్ 13 స్పెసిఫికేషన్స్:
ఐఫోన్ అంటేనే.. ఒక స్టేటస్ సింబల్. చాలా మంది తమ స్టేటస్‌ను చూపించుకోవడం కోసమే ఐఫోన్ ను పర్చేస్ చేస్తారు. 2007 వచ్చిన ది ఐఫోన్ మోడల్ మొదలుకొని 2022లో వచ్చిన ఐఫోన్ 14 సిరీస్ వరకు అనేక మోడళ్లు మనకు అందుబాటులోకి వచ్చాయి. స్పెసిఫికేషన్స్ పరంగానూ అప్ గ్రేడ్ అవుతూనే ఉంది. ఐఫోన్ 12 వరకు A14 బయోనిక్ చిప్ సెట్ ఉంటే.. ఐఫోన్ 13 సిరీస్ లో A15 బయోనిక్ చిప్ సెట్ అందించారు.
IPhone 13 128 GB at Rs.49,990 ? pic.twitter.com/zUXIuns80R
— TechGlare Deals (@Tech_glareOffl) September 14, 2022
ఇదీ చదవండి: Nothing Phone (1): ఫ్లిప్‌కార్ట్ ధమాకా ఆఫర్.. ఏకంగా రూ. 5 వేల తగ్గింపు!
ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. Google Pixel 6aపై రూ.16, 500 తగ్గింపు!