140 కోట్లకు పైగా జనాభా ఉన్న మనదేశం స్మార్ట్‌ఫోన్లకు అత్యంత విలువైన మార్కెట్. అందుకే.. విదేశీ కంపెనీలు అన్నీ కూడా ఇక్కడే మకాం వేసి.. పబ్బం గడుపుకుంటున్నాయి. రోజుకో కంపెనీ ఏదో ఒక పేరుతో ఫోన్లను మార్కెట్ లోకి వదులుతున్నాయి. ఈ తరుణంలో వీటి మధ్య పోటీ ఎక్కువవుతోంది. ధర తక్కువుగా ఉంటే తప్ప.. కొనుగోలుదారులు వాటిపై ఆసక్తి చూపట్లేదు. ఈ నేపథ్యంలో పోటీలో నిలబడానికి దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ ముందడగు వేసింది. ఫోన్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
రూ. 3,500 తగ్గింపు
శాంసంగ్ గ్యాలక్సీ ఏ32 8జీబీ + 128జీబీ వేరియంట్ పై ఈ తగ్గింపు ప్రకటించింది. ఈ మొబైల్ గత ఏడాది నవంబర్‌లో లాంచ్ అయినప్పుడు రూ. 23,499 ప్రారంభ ధరతో లాంచ్ చేయబడింది. ప్రస్తుతానికి ధర తగ్గింపు తర్వాత, ఏ32 రూ. 19,999 ధరకు అందుబాటులో ఉంది. అదే.. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో కానీ, అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ లో కానీ దీన్ని కొనుగోలు చేసినట్లయితే.. మరింత తక్కువుకే సొంతం చేసుకోవచ్చు.
స్పెసిఫికేషన్స్:
ఇందులో, మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజీని 1TB వరకు విస్తరించుకోవచ్చు. అవెసమ్ బ్లూ, అవెసమ్ బ్లాక్, అవెసమ్ వయొలెట్.. ఇలా మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ఏ53పైనే కాకుండా.. ఏ53 5జీ పై కూడా రూ. 3,000 తగ్గింపు ఉంది.