స్మార్ట్ ఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ, స్మార్ట్ ఫోన్ కొనాలి అంటే దాదాపు రూ.25 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఐకూ కంపెనీ నుంచి సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలోనే లాంఛ్ అయ్యింది.
మార్కెట్ లోకి కొత్త కొత్త మోడల్స్ స్మార్ట్ ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. కానీ, మంచి ఫీచర్స్ కలిగిన ఒక 5జీ ఫోన్ కొనుగోలు చేయాలి అంటే దాదాపు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చు పెట్టక తప్పదు. కానీ, కొన్ని కంపెనీలు మాత్రం అతి తక్కువ ధరలో మంచి ఫీచర్స్ లో స్మార్ట్ ఫోన్స్ ని రిలీజ్ చేస్తున్నారు. అందులో వివో కంపెనీ కూడా ఒకటని చెప్పచ్చు. తాజాగా వివోకి చెందిన ఐకూ స్మార్ట్ పోన్స్ కి మంచి డిమాండ్ పెరిగింది. పైగా బడ్జెట్ లోనే అదిరిపోయే ఫీచర్స్ తో ఐకూ నుంచి స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అవుతున్నాయి. తాజాగా మార్కెట్ లో ఐకూ జడ్7 మోడల్ విడుదలైంది. ప్రస్తుతం అందరూ ఆ ఫోన్ గురించే మాట్లాడుకుంటున్నారు.
ఐకూ కంపెనీ అనేది వివో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీకి చెందింది. ఈ మధ్యకాలంలో ఐకూ బ్రాండ్ ఫోన్స్ కి మంచి డిమాండ్ వచ్చింది. ఎందుకంటే అతి తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్ తో 5జీ స్మార్ట్ ఫోన్స్ ని ఐకూ లాంఛ్ చేస్తోంది. ఐకూ నుంచి జడ్ సిరీస్ ఫోన్స్ కి మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ఆ సిరీస్ నుంచి సరికొత్త బడ్జెట్ 5జీ మోడల్ ని లాంఛ్ చేశారు. ఫోన్ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సేల్ లోకి వచ్చింది. 6+ 128జీబీ వేరియంట్ ధర రూ.18,999కాగా HDFC, ఎస్ బీఐ బ్యాంక్ కస్టమర్స్ కి రూ.1,500 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ఉంది. అంటే రూ.17,499కే ఈ ఐకూ జెడ్7 ఫోన్ మీరు సొంతం చేసుకోవచ్చు. 8+ 128 జీబీ వేరియంట్ ధర రూ.19,999కాగా రూ.18,499కే అందిస్తున్నారు.
Get ready to slay, stream, shoot & repeat with the #iQOOZ7 5G, powered by the MediaTek Dimensity 920 & Segment’s Brightest AMOLED display* making it a #FullyLoaded smartphone for a #FullyLoadedYou at just ₹17,499*. 💯📱
Sale goes live @amazonIN on 21st Mar, 1PM. pic.twitter.com/efgVcJfodV
— iQOO India (@IqooInd) March 17, 2023
ఇంక ఈ ఐకూ జడ్7 మోడల్ ఫీచర్స్ విషయానికి వస్తే.. మీడియాటెక్ డైమెన్సిటీ 920 6ఎన్ఎం ప్రాసెసర్ తో ఈ ఫోన్ వస్తోంది. అన్ టుటూ స్కోరింగ్ లో 4.85 లక్షల స్కోర్ చేసింది. 6.38 ఇంచెస్ ఆమెలెడ్ డిస్ ప్లేతో ఈ ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ కేవలం 7.8 ఎంఎం తిన్ గానే ఉంటుంది. ఇందులో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 90 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెట్జ్ హై టచ్ శాంపిలింగ్ రేట్, 1300 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తోంది. ఇందులో 64ఎంపీ ఓఐఎస్ కెమెరా ఉంది. వ్లాగ్ మూవీ మోడ్, 4కే వీడియో రికార్డింగ్, సూపర్ నైట్ మోడ్ ఆప్షన్స్ ఉన్నాయి. 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ అందిస్తున్నారు. 25 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జ్ అవుతుంది. ఇన్ని ఫీచర్స్ తో వస్తున్న రూ.20 వేలలోపు 5జీ స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఇదే అవుతుందని టెక్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ IQOO Z7 5జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.