ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు అద్భుతమైన అవకాశం వచ్చేసింది. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్, సెప్టెంబర్ 23నుంచి 30 వరకు.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 పేరుతో సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల నుంచి గ్రాసరీల వరకు అన్ని రకాల వస్తువలపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా 20,000 లోపు అమెజాన్ లో లభిస్తున్న స్మార్ట్‌ఫోన్ వివరాలను మీకందిస్తున్నాం..
భారీ డిస్కౌంట్లతో పాటు ప్రీపెయిడ్ ఆర్డర్లు, బ్యాంకు కార్డుల ద్వారా ఆకర్షణీయ ఆఫర్లతో పాటు పలు ఫోన్లపై ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. డిస్కౌంట్ ధరపై లిస్టయిన మొబైల్ ఫోన్లకు అదనంగా పలు ఆఫర్లు తోడవడంతో ఆకర్షణీయ ధరకే డ్రీమ్ ఫోన్లను కస్టమర్లు దక్కించుకోవచ్చు.