టెక్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది. తమ యాప్స్‌లో సరికొత్త టెక్నాలజీని చేరుస్తూ యూజర్లకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తోంది. తాజాగా ఈ సెర్చ్ ఇంజిన్ లెజెండ్ తన మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. నావిగేషన్ యాప్ వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేలా కొత్త అప్‌డేట్స్‌ను గూగుల్ తీసుకొచ్చింది. ఇమ్మర్సివ్ వ్యూ అనే కొత్త ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్‌లో జత చేసింది. యూరప్‌లోని ఐదు కీలక నగరాల్లో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను.. త్వరలో మిగిలిన సిటీల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఫీచర్ ద్వారా గూగుల్ మ్యాప్‌లో మరింత స్పష్టంగా ఆయా ప్రదేశాలను చూసేందుకు వీలు కలుగుతుంది. ఇంతకుముందు ఉన్న సాధారణ స్ట్రీట్ వ్యూ ఫీచర్‌లాగానే ఇది కూడా పని చేస్తుంది. అయితే మరిన్ని స్ట్రీట్ వ్యూ, ఏరియల్ ఇమేజెస్‌తో వర్చువల్ వరల్డ్ మోడల్‌ను అందిస్తోంది.
కొత్త ఫీచర్ ద్వారా గూగుల్ మ్యాప్‌లో ఆయా ప్రదేశాలను మరింత స్పష్టంగా చూడొచ్చు. వాతావరణం, ట్రాఫిక్, లొకేషన్ ఎంత బిజీగా ఉన్నాయనే సమాచారాన్నీ తెలుసుకోవచ్చు. మరికొద్ది నెలల్లో ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లో వరల్డ్‌వైడ్‌గా ‘గ్లాన్సబుల్ డైరెక్షన్స్’ అనే కొత్త ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ తెలిపింది. అలాగే ఏటీఎంలు, రెస్టారెంట్‌లు, పార్కులు, రెస్ట్‌రూమ్‌లు, లాంజ్‌లు, టాక్సీస్టాండ్‌లు, రెంటల్ కార్లు లాంటి అనేక విషయాలను గుర్తించేందుకు మరో ఫీచర్‌ను యాడ్ చేశామని పేర్కొంది. ఏఐ, అగ్మెంటెడ్ రియాలిటీ సాయంతో తయారు చేసిన ‘సెర్చ్ విత్ లైవ్ వ్యూ’ గురించి కూడా గూగుల్ వెల్లడించింది. ఈ లైవ్ వ్యూను లండన్, లాస్ ఏంజెల్స్, న్యూయార్క్, ప్రేగ్, సావో పాలో, సింగపూర్ లాంటి అనేక నగరాల్లోని వెయ్యి కొత్త విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్‌లు, మాల్స్ లాంటి కీలక వివరాలను రానున్న రోజుల్లో అందిస్తామని చెప్పుకొచ్చింది. మరి.. గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల తెలియజేయండి.
Google demos its new immersive maps view at its event in Paris today. pic.twitter.com/LjjXDy15gp
— Richard Holmes (@richeholmes) February 8, 2023