స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు చిన్న పిల్లల చేతిలోనూ ఫోనో, ట్యాబో ఏదొకటి ఉండాల్సిందే. స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు అందరికీ అత్యవసరంగా మారిపోయింది. కొంతమందికి ఇది అవసరం మాత్రమే కాదు.. జీవనోపాధి సాధనం కూడా. అయితే పెరుగుతున్న డిమాండ్‌తో మార్కెట్‌లోకి ప్రతినెలా కొత్త మోడళ్లు వస్తూనే ఉన్నాయి. ఎప్పచికప్పుడు అతి తక్కువ ధరలు, పండగ ఆఫర్లు అంటూ చాలా చౌక ధరలో ఫోన్లను విక్రయిస్తున్నారు. ఇంక 5జీ సేవలు కూడా ప్రారంభం కానుండడంతో స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ మరింత పెరింగింది. కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఇదే మంచి తరుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్టోబర్ నెలలో అదిరిపోయే స్మార్ట్ ఫోన్లు లాంఛ్ కాబోతున్నాయి. అంతే కాకుండా దసరా సేల్, దీపావళి సేల్ అంటూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లు, స్పెషల్ ప్రైస్‌లు అంటూ చాలా ఆఫర్లు నడుస్తున్నాయి. అసలు అక్టోబర్ విడుదల కానున్న ఫోన్లు ఏవో వాటి వివరాలు చూద్దాం.
వన్ ప్లస్ కంపెనీ అనతికాలంలోనే వినియోగదారుల నమ్మకాన్ని పొందింది. ఆ కంపెనీ నుంచి వచ్చే ప్రతి మోడల్‌కు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఎంతో సక్సెస్ అయిన నార్డ్ సిరీస్ నుంచి కొత్త ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. వన్ ప్లస్ నార్డ్ 3 మోడల్‌ని అక్టోబర్ 24వ తేదీకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంక ఈ మోడల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 50ఎంపీ+ 8 ఎంపీ+ 2 ఎంపీ బ్యాక్ కెమెరా, 16 ఎంపీ రేర్ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ 2.85 గిగాహెట్జ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ఆక్టాకోర్ ప్రాసెసర్ ని వినియోగించారు. 6.7 ఇంచెస్ ఫ్లూయిడ్ ఆమోలెడ్ డిస్‌ప్లే, 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి రానుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ లభించనుంది. ఈ ఫోన్ ధర రూ.28 వేల నుంచి రూ.35 వేలలోపు ఉంటుందని టెక్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు.
భారతదేశంలో షావోమీ ఫోన్‌కు ఎంతో మంచి ఆదరణ లభించింది. అత్యాధునిక టెక్నాలజీతో, అతి తక్కువ ధరలో ఫోన్లను అందించడంలో షావోమీ సంస్థ ముందుంటుంది. ఈ ఫోన్‌లో అక్టోబర్‌లో కొత్త మోడళ్లు లాంఛ్ కానున్నాయి. అవే షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో. 6.67 ఇంచెస్ ఆమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్‌సెట్, 2.85 గిగాహెట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా ఈ ఫోన్ 200 ఎంపీ బ్యాక్ కెమెరాతో రాబోతోంది. ఒక మోడల్‌లో 4500 ఎంపేహెచ్ బ్యాటరీ ఉండనుండగా.. మరో మోడల్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఈ ఫ్లాగ్ షిప్ సెగ్మెంట్‌లో రానున్నాయి. వీటి ధర రూ.50 వేల నుంచి రూ.60 వేల మధ్య ఉండచ్చని టెక్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు.
అత్యాధునిక ఫీచర్లతో అత్యంత తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లు అందిచడంలో రియల్ మీ సంస్థ దిట్ట అనే చెప్పాలి. ఇప్పుడు ఈ రియల్ మీ కంపెనీ 10 సిరీస్ పేరిట పలు మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురానుంది. మొదట అక్టోబర్ నెలలో ఒక మోడల్ ఆ తర్వాత.. రియల్ మీ ప్రో, 5జీ, అల్ట్రా, 10+ అంటూ వివిధ వేరియంట్లను స్మార్ట్ ఫోన్ విపణిలోకి విడుదల చేయనుంది. ప్రస్తుతానికి అయితే ఈ రియల్ మీ 10 సిరీస్‌కి సంబంధించి స్పెసిఫికేషన్ వివరాలు తెలియలేదు. త్వరలోనే ఫీచర్లు, ప్రైస్ డీటెయిల్స్ విడుదల చేస్తారని తెలుస్తోంది.
స్మార్ట్ ఫోన్ యుగంలో మోటరోలా తన మార్క్ చూపించోందుకు పరితపిస్తోంది. షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివో వంటి కంపెనీల తరహాలో మోటరోలా కూడా వరుస మోడళ్లను విడుదల చేస్తోంది. అక్టోబర్ నెలలో మోటో ఎడ్జ్ 30 నియో పేరిట ఒక కొత్త మోడల్‌ను విపణిలోకి విడుదల చేయనుంది. ఈ మోడల్‌లో 6.28 హెట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.28 ఇంచెస్ పీవోఎల్‌ఈడీ డిస్‌ప్లేని అమరుస్తున్నారు. 64ఎంపీ+ 13ఎంపీ బ్యాక్ కెమెరాలు, 32 ఎంపీ రేర్ కెమెరాని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. బ్యాటరీ విషయంలో మాత్రం వినియోగదారులు కాస్త అసంతృప్తి చెందే అవకాసం ఉంది. ఎందుకంటే కేవలం 4,020 ఎంఏహెచ్ బ్యాటరీని మాత్రమే వాడుతున్నట్లు చెబుతున్నారు. 695 స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ని వినియోగించనున్నారు. ఈ ఫోన్ ధర రూ.20 వేలలో ఉండే అవకాశం ఉంది.
ఐకూ.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో బాగా వినిపిస్తున్న పేరు. అతి తక్కువ సమయంలో ఈ ఫోన్లు చాలా బాగ్ క్లిక్ అయ్యాయి. ఇప్పుడు ఐకూ నియో సిరీస్‌లో అక్టోబర్ నెలలో మరో కొత్త మోడల్ విడుదల కానుంది. అదే ఐకూ నియో 7 ఫోన్ అనమాట. 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 120 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, మీడియోటెక్ డైమిన్సిటీ 9000+ ప్రాసెసర్ వంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇవే కాకుండా ఇంకా ఎన్నో మోళ్లు ఈ అక్టోబర్ నెలలో విడుదల కానున్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు దసరా, దీపావళి సందర్భంగా అదిరిపోయే ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.