ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడనివారంటూ ఎవరూ ఉండటం లేదు. ఉదయం లేచినదగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ లతోనే కాలం గడిపేస్తున్నారు. అయితే.. ఈ స్మార్ట్ ఫోన్ వాడకం మనకు తెలీకుండానే మన మెదడు పనితీరుపై పడిపోతోందట. ఈ విషయంపై పరిశోధన చేసిన నిపుణులు ఇలాంటి ఎన్నో సంచలన విషయాలు కనుగొన్నారు. ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్ రేడియేషన్ ఎంత ఉండాలి? ఎలా చెక్ చేయాలి? అన్న విషయాలను తెలియజేయస్తున్నాం..
సాధారణంగా మనం కొత్త ఫోన్ కొనేటప్పుడు కెమెరాలు, ర్యామ్, స్టోరేజ్ లాంటి విషయాలు మాత్రమే గమనిస్తాము. కానీ, కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు ఫోన్ యొక్క రేడియేషన్ లెవెల్ వివరాలు కూడా చెక్ చేయడం శ్రేయస్కరమంటున్నారు.. నిపుణులు. అయితే, మనలో చాలా మందికి అది ఏమిటో కూడా తెలియదు. మన ఆరోగ్యానికి స్మార్ట్ ఫోన్ రేడియేషన్ కి చాలా దగ్గరి సంబంధం ఉంటుందట. ఫోన్ అతిగా వాడటం వల్ల మెదడు పనితీరు కూడా రోజు రోజుకీ తగ్గిపోతుందట. అంతేకాదు.. విచ్చలవిడిగా వాడేవారిలో ఒళ్లు నొప్పులు వీపరీతంగా వస్తున్నాయని చెబుతున్నారు.
స్మార్ట్‌ఫోన్‌తో ఎక్కువ సమయం గడిపే మనలాంటి వారికి, దాని ద్వారా వచ్చే రేడియేషన్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది చర్మ రుగ్మత నుండి క్యాన్సర్ ప్రమాదానికి దారితీస్తుంది. సాధారణంగా స్మార్ట్‌ఫోన్ విడుదల చేసే రేడియేషన్ మొత్తాన్ని SAR ద్వారా లెక్కిస్తారు. ‘SAR’ అంటే ‘స్పెసిఫిక్ అబ్సార్ప్షన్ రేట్’ అని అర్థం. ఒక స్మార్ట్ ఫోన్ నుండి వెలువడే “విద్యుదయస్కాంత” తరంగాలు లేదా రేడియో కిరణాల పరిమాణాన్ని “SAR” అంటారు. ఇది ఫోన్ నుండి విడుదలయ్యే శక్తిని లేదా శరీరం వినియోగించే రేడియేషన్ మొత్తాన్ని సూచిస్తుంది. మనం వాడే స్మార్ట్ ఫోన్ లో ‘వాట్స్ పర్ కిలోగ్రాము’ ఆధారంగా ఈ SAR విలువను అంచనా వేస్తారు.
How Much Radiation is Emitted by Popular Smartphones?
This article is worthy to read https://t.co/gnZaU4fzzm #Radiation #smartphone pic.twitter.com/Serma5V2UJ
— Henry Han , MBBS, MD (@HanCardiomd) April 16, 2022
స్మార్ట్ ఫోన్ లో SAR విలువ తక్కువగా ఉంటే, ఫోన్ చాలా సురక్షితంగా ఉందని అర్థం. తక్కువ మొత్తంలో రేడియేషన్ వెలువడినప్పుడు, అది శరీరంలోకి చొచ్చుకుపోయినా పెద్దగా హాని కలిగించదు. అదే.. ఎక్కువ మొత్తంలో వెలువడితే అది మీ శరీరానికి హానికరం అని చెప్పవచ్చు. కనుక తక్కువ SAR విలువ ఉన్న ఫోన్లను ఎంచుకోవడం ఉత్తమమంటున్నారు.. నిపుణులు.
మీ స్మార్ట్‌ఫోన్ డయల్ ప్యాడ్‌లో * # 07 # అని టైప్ చేసి ఆకుపచ్చ కాల్ బటన్‌ను నొక్కండి. అంతే.. మీ ఫోన్ యొక్క SAR విలువ డిస్ ప్లే అవుతుంది. అది కనుక 1.6 W / kg ఉంటే.. సురక్షితమని అర్థం. అదే.. 1.6 W / kg కంటే ఎక్కువ ఉంటే.. మీ ఆరోగ్యానికి హానికరమని అర్థం చేసుకోండి. కాబట్టి, మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు, SAR విలువ 1.6 W / Kg లోపు ఉండేలా చూసుకోండి.
Check radiation level of your smartphone.Dial *#07# on your dial pad,if the result shows SAR value above 1.6 W/Kg.
Then change your smartphone immediately.
Thank me later. pic.twitter.com/UhKyS5jiLU— miss⚘ (@__goldenrose_) December 1, 2019