అనలాగ్ వాచెస్ అంటే యువత అంతా ఫాస్ట్రాక్ పేరు చెబుతుంటారు. వాళ్లు ఎక్కువగా ఈ కంపెనీకి చెందిన వాచెస్ నే ఇష్టపడుతుంటారు. తాజాగా ఈ కంపెనీ స్మార్ట్ వాచెస్ ని కూడా విరివిగా రిలీజ్ చేస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ మోడల్స్ పై దృష్టి సారించారు. ఇప్పుడు ఫాస్ట్రాక్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ వాచ్ భారత్ లో విడుదలైంది.
ఫాస్ట్రాక్ ఈ కంపెనీకి సంబంధించి అనలాగ్ వాచెస్ కి మంచి మార్కెట్ ఉంది. యువత అంతా ఈ ఫాస్ట్రాక్ వాచెస్ నే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు స్మార్ట్ వాచెస్ పై ఈ కంపెనీ దృష్టి సారించింది. ఎలా అయితే అనలాగ్ వాచెస్ లో మార్కెట్ క్రియేట్ చేసుకున్నారో.. అలాగే స్మార్ట్ వాచ్ మార్కెట్ ని కూడా బిల్డ్ చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకే బడ్జెట్ స్మార్ట్ వాచెస్ ని రిలీజ్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికే ఫాస్ట్రాక్ నుంచి బడ్జెట్ స్మార్ వాచెస్ ఉన్నాయి. తాజాగా మరో మోడల్ ని కూడా ఫాస్ట్రాక్ కంపెనీ ప్రారంభించింది. లిమిట్ లెస్ FS1 పేరిట భారత్ లో ఈ ఫాస్ట్రాక్ వాచ్ ని లాంఛ్ చేశారు.
ఫాస్ట్రాక్ కంపెనీకి అంత క్రేజ్ రావడానికి రెండో కారణాలు.. స్టైలిష్ డిజైన్, బడ్జెట్ ధరలు. ఇప్పుడు ఈ రెండు సక్సెస్ ఫార్ములాలనే స్మార్ట్ వాచెస్ మార్కెట్ విషయంలో కూడా వాడుతోంది. అందుకే అద్భుతమైన డిజైన్స్ లో బడ్జెట్ స్మార్ట్ వాచెస్ ని రిలీజ్ చేస్తోంది. తాజాగా ఆ లిస్టులోకి ఫాస్ట్రాక్ లిమిట్ లెస్ FS1 స్మార్ట్ వాచ్ చేరింది. భారత్ మార్కెట్ లో ఈ వాచ్ ని విడుదల చేశారు. చూడటానికి స్టైలిష్ గా.. ఎన్నో ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ వాచ్ ధరను రూ.1,995గా నిర్ణయించారు. మీ మూడ్ కి తగ్గట్లుగా ఇందులో సెట్ అయ్యే వాచ్ ఫేసెస్ ఉండటం విశేషం. ఇందులో 150కి పైగా వాచ్ ఫేసెస్ ఉన్నాయి.
ఇంక ఈ ఫాస్ట్రాక్ లిమిట్ లెస్ ఎఫ్‌ఎస్1 స్మార్ట్ వాచ్ ఫీచర్స్ విషయానికి వస్తే.. 1.95 ఇంచెస్ హారిజోన్ కర్వ్ తో ఈ వాచ్ డిస్ ప్లే వస్తోంది. దీనిలో నెక్ట్స్ జెనరేషన్ ఏటీఎస్ చిప్ సెట్ ఉంది. సింగిల్ సింక్రనైజ్ బ్లూటూత్ కాలింగ్ కూడా ఉంది. ఇంక బ్యాటరీ అయితే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజులు వరకు వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఎక్కువగా వాడితే కాస్త బ్యాకప్ తగ్గుతుంది. ఇందులో ఇన్ బిల్ట్ అలెక్సా కూడా ఉంది. మీకు కావాల్సిన ఎన్నో ప్రశ్నలను దీనిని అడగచ్చు. అలాగే మీ ఇంట్లో ఉన్న స్మార్ట్ గ్యాడ్జెస్ ని కనెక్ట్ చేసి ఆపరేట్ చేయచ్చు. 100కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఈ వాచ్ ని ఏప్రిల్ 11న సేల్ కి తీసుకురానున్నారు.
Get, set, you are about to get limitless with India’s first horizon-curve display, and more at Special Launch price of Rs 1995!
Go to the link in bio to be notified about our smart launch of Fastrack Limitless FS1 exclusively on @amazondotin @ 11th April.#GotToBeLimitless pic.twitter.com/XoQt22Vpzu
— Fastrack (@Fastrack) April 6, 2023