మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలకు మారిపోతున్నారు. పర్యావరణహితం కోసం ప్రభుత్వాలు కూడా ఈ వాహనాలకు సబ్సిడీలు ఇస్తున్నారు. ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అంటే మినిమం రూ.1.30 లక్షలు అయినా ఉండాలి. రూ.లక్షలోపు స్కూటర్ దొరకడం అంటే గగనమనే చెప్పాలి.
ప్రస్తుతం అంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు మళ్లుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈవీ వాహనాలే సరైనవని ప్రభుత్వాలు కూడా సబ్సిడీలతో ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే భారత్ లో ఎన్నో ఈవీ వాహనాలు ఉన్నాయి. కొత్త కొత్త కంపెనీలు కూడా ఈవీ స్కూటర్లు, కార్లను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఈవీ స్కూటర్లకు మంచి డిమాండ్ పెరిగింది. ఓలా వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఈ ఈవీ టూవీలర్ చేస్తున్నాయి. అయితే వాటి ధర విషయంలోనే వినియోగదారులు వెనుకాడుతున్నారు. అయితే ఏథర్ కంపెనీ ఇప్పుడు ఆ ధర విషయంపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రూ.లక్షలోపే ఈవీ స్కూటర్ తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు.
ఈవీ స్టూటర్లలో ఓలా తర్వాత ఏథర్ కంపెనీకి మంచి క్రేజ్ వచ్చింది. నిజానికి ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రో మోడళ్లపై కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సమయంలో ఏథర్ కంపెనీ స్కూటర్లను విరివిగా కొన్నారు. అయితే ఈ ఏథర్ కంపెనీ నుంచి వచ్చిన మోడల్స్ కూడా ధర విషయంలో కాస్త ఖరీదుగానే భావిస్తున్నారు. అన్ని సబ్సిడీలు పోయిన తర్వాత కూడా ఏథర్ కంపెనీ ఈవీ స్కూటీ రెండు మోడల్స్ రూ.లక్ష పైనే ఉన్నాయి. ఈ విషయంలోనే వినియోగదారులు ఏథర్ అంటే కాస్త వెనక్కు తగ్గుతున్నారు. అయితే ఇప్పుడు ఈ కంపెనీ బిలో మిడిల్ క్లాస్ వారిని కూడా ఆకట్టుకునేందుకు కొత్త మోడల్ తీసుకురానున్నట్లు చెబుతున్నారు.
ఈసారి రూ.లక్షలోపు ధరతో కొత్త మోడల్ తీసుకొస్తున్నట్లు ఆటో మొబైల్ మార్కెట్ లో ప్రచారాలు జోరందుకున్నాయి. పక్కాగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వినియోగదారులే లక్ష్యంగా ఈ మోడల్ తెస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఏథర్ రెండు మోడల్స్ ధరలు చూసుకుంటే.. ఢిల్లీలో అయితే ఫేమ్-2, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు పోయిన తర్వాత కూడా.. ఏథర్ 450+ రూ.1,18,895గా ఉండగా ఏథర్ 450X ధర రూ.1,41,905గా ఉంది. మరి.. ఏథర్ నుంచి రూ.లక్షలోపు ఈవీ స్కూటర్ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియేజేయండి.