Android apps: స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిపోయిన తర్వాత మన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన భద్రత పూర్తిగా చెయ్యి దాటిపోయింది. కొందరు వ్యక్తులు మనకు సంబంధించిన విషయాలు మార్కెట్‌లో పెట్టి అమ్మేస్తున్నారు. కొన్ని సార్లు సైబర్ నేరగాళ్లు మనల్ని మోసం చేస్తుంటే.. మరికొన్ని సార్లు మన చేతులారా మనంతకు మనమే మోసపోతున్నాము. సైబర్ నేరాలు జరగటానికి గల ప్రధాన కారణాల్లో ప్రమాదకర వైరస్ కలిగిన ఆండ్రాయిడ్ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం కూడా ఒకటి. వాటినే ఇంగ్లీష్‌లో మాలీసియస్ యాప్స్ అంటారు. ఈ యాప్స్ ద్వారా మన వ్యక్తిగత సమాచారం చోరీ చేయబడుతుంది. అంతేకాదు! ఆ డేటా ద్వారా మన ఫోన్‌ను హ్యాక్ చేసి, మన బ్యాంకు ఖాతాల్లోని డబ్బుల్ని కూడా ఈజీగా కొట్టేసే అవకాశం ఉంటుంది. అందుకే మాలీసియస్ యాప్స్‌కు దూరంగా ఉండటం మంచిది.
కానీ, మాలీసియస్ యాప్స్‌ను గుర్తించి వాటికి దూరంగా ఉండటం ఎలా?.. దీనికి మనం చేయాల్సిందల్లా.. గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్స్‌ను మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. బయటి యాప్స్‌ను అస్సలు వాడకూడదు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే 17 యాప్స్‌ను అస్సలు వాడొద్దు. ఒక వేళ మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే డిలీట్ చేయండి. ఈ యాప్స్‌లో కొన్ని మోసాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాయి. వీటిని ఫోన్ ఎరినా.. మాలీసియస్ యాప్స్‌గా గుర్తించింది. వీటిలో కొన్నింటిని గూగుల్ ప్లేస్టోర్ కూడా తొలగించింది. వీటిలో మరికొన్ని 50వేల డౌన్‌లోడ్స్, 4ప్లస్ రేటింగ్‌తో ఉన్నాయి. వీటన్నింటిని చూసి మీరు మోస పోకండి. కింద చెప్పబోయే యాప్స్ గనుక మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి.
ఆ 17 యాప్స్..
ఇవి కూడా చదవండి : Whatsapp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. స్టాటస్‌ల మాదిరి DPలు కూడా..