Whatsapp: వాట్సాప్ వాడకం అన్నది ప్రజల నిత్యావసరం అయిపోయింది. రోజులో ఒక పది నిమిషాలు కూడా వాట్సాప్ వాడకుండా ఉండలేని వాళ్లు కూడా ఉన్నారు. రోజు, రోజుకు వాట్సాప్ యూజర్ల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇక, వాట్సాప్ కూడా తమ యూజర్లను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. వారికి ఓ మంచి అనుభవాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. నిన్నటివరకు వాట్సాప్‌లోని డీపీలను కొందరికి మాత్రమే కనిపించేలా పెట్టడం కుదరదు. అందరికీ కనిపించేలా లేదా మన కాంటాక్ట్ లిస్ట్‌లోని వారికి మాత్రమే కనిపించేలా.. లేదంటే ఎవ్వరికీ కనిపించకుండా డీపీని ఉంచటం మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే, కొత్తగా వచ్చిన మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ ఫీచర్ ప్రకారం మన డీపీని స్టాటస్‌ల మాదిరి సెలెక్టెడ్ పీపుల్‌కు కనిపించేలా పెట్టుకోవచ్చు. వద్దనుకున్న వారికి కనిపించకుండా చేయొచ్చు. ఈ ఫీచర్‌ను క్లిక్ చేయగానే మన కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో మనం ఎవరికైతే మన డీపీ కనిపించకూడదు అనుకుంటున్నామో వారి కాంటాక్ట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అలా చేస్తే వారికి మన డీపీ కనిపించదు. మరి, ఈ ఫీచర్ అదిరిపోయింది కదూ. మరి, వాట్సాప్ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త ఫీచర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Jio నుంచి సూపర్ ప్లాన్.. రూ.75కే అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా కూడా!