క్రికెట్ లో టీ20 టోర్నీలు వచ్చాక సంప్రదాయ క్రికెట్ అయిన టెస్టు మ్యాచ్ లకు ఆదరణ తగ్గిందన్నది కాదనలేని వాస్తవం. అయితే టెస్టు క్రికెట్ కు పునర్వైభవాన్ని తీసుకొస్తామని, ప్రేక్షకులను తమ బ్యాటింగ్ తో మళ్లీ గ్రౌండ్స్ కు రప్పిస్తామని న్యూజిలాండ్ మాజీ బ్యాటర్, ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ మెక్ కల్లమ్ అన్నాడు. పాక్ తో జరగబోయే టెస్టు సిరీస్ కు ముందు మెక్ కల్లమ్ అన్న మాటలు ఇవి. ఇవేకాక పాక్ బౌలర్లను పిచ్చికొట్టుడు కొడతామని ముందే హెచ్చరించాడు. అన్నట్లుగానే చేస్తున్నారు ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ లు. టెస్టు మ్యాచ్ ను టీ20 లెక్క ఆడుతున్నారు వీరు. క్రాలే సెంచరీతో కదం తొక్కగా అతడికి అండగా నిలుస్తున్నాడు డకెట్.
”పాక్ బౌలర్లను పిచ్చకొట్టుడు కొడతాం.. మా బ్యాటింగ్ పవర్ ఏంటో చూపిస్తాం” అని పాక్ లో అడుగు పెట్టే ముందు ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే ఇంగ్లాండ్ టీమ్ పాక్ లో అడుగు పెట్టగానే జట్టు కెప్టెన్ తో సహా 12 మంది ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలో అసలు మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు నెలకొన్నాయి. వాటన్నింటిని అధిగమించి తొలి టెస్టు మ్యాచ్ డిసెంబర్ 1న ప్రారంభం అయ్యింది. మ్యాచ్ ప్రారంభం అయ్యక తెలిసింది.. అసలు ఇది టెస్టు మ్యాచ్ హా లేక టీ20 నా అని. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తోంది.
Pakistan bowlers are getting blown away by the Bazball 🔥#PAKvENG pic.twitter.com/FZNbKVOzcZ
— CricTracker (@Cricketracker) December 1, 2022
ఇంగ్లాండ్ ఓపెనర్లు కేవలం 13.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 102 పరుగులు చేశారు అంటేనే అర్దం అవుతుంది వారి విధ్వంసం ఏ స్థాయిలో ఉందో. ఇక మెుదటి సెషన్ పూర్తి అయ్యే సరికి 28 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 180 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ లు పాక్ బౌలర్లను ఊచకోతకోస్తూ.. పరుగులు పిండుకుంటున్నారు. ఈ జోడిని బ్రేక్ చేయడానికి పాక్ అష్ట కష్టాలు పడుతోంది. వరల్డ్ క్లాస్ బౌలర్లు గా పేరుగాంచిన పాక్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు ఇంగ్లాండ్ ఓపెనర్లు. ప్రస్తుతం 29 ఓవర్లలో వికెట్ నష్ట పోకుండా 185 పరుగులతో భారీ స్కోర్ వైపు దూసుకెళ్తోంది. ఓపెనర్ డకెట్ 90 బంతుల్లో 11 ఫోర్లతో 80 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ జాక్ క్రాలే 85 బంతుల్లో 19 ఫోర్లతో 103 పరుగులతో అజేయ శతకం సాధించి దూసుకెళ్తున్నాడు.
What an outstanding display of Bazball from England in the first session!
#PAKvsENG pic.twitter.com/33s78ztsjU
— CricTracker (@Cricketracker) December 1, 2022