ఆసియా కప్‌లో భారత మహిళ క్రికెట్ జట్టు సాధిస్తున్న విజయాల పరంపరకు బ్రేక్ పడింది. దాయాధి పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా, భారత జట్టు 124 పరుగులకే చాప చుట్టేసింది. ఫలితంగా 13 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. కాగా, పాకిస్తాన్ పై థాయిలాండ్ మహిళల జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే.
వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టుకు పాకిస్తాన్ అడ్డుకట్టవేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో పాక్ జట్టు అద్భుత పోరాటపటిమ చూపిసునాయాస విజయాన్ని అందుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. నిదా దార్ (56; 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించగా, కెప్టెన్ మారూఫ్ (32; 35 బంతుల్లో, 2 ఫోర్లు) ఆమెకు చక్కటి సహకారాన్ని అందించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా, పూజా వస్ట్రాకర్ 2, రేణుక సింగ్ 1 వికెట్ తో రాణించారు. అనంతరం 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళ క్రికెట్ జట్టు 19.4 ఓవర్లలో 124 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. చివరిలో రిచా గోష్(26; 13 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు) మెరుపులు మెరిపించినా, అవి విజయాన్ని అందించలేకపోయాయి. పాక్ బౌలర్లలో నష్రా సందు 3 వికెట్లు తీయగా, నిదా ధార్, సదియా ఇక్బాల్ తలా రెండు వికెట్లతో రాణించారు.
After losing to Thailand 24 hours ago, Pakistan have turned it around and how!
They’ve registered their THIRD win vs India in women’s T20Is, and their first victory over them in the Asia Cup 😮 #INDvPAK #AsiaCup2022
— ESPNcricinfo (@ESPNcricinfo) October 7, 2022
ఇక, ఆసియా కప్ లో టీమిండియాకు ఇదే తొలి ఓటమి. టీ20 ఫార్మాట్ లో పాకిస్థాన్ కు టీమిండియాపై ఇది మూడో విజయం మాత్రమే. 2012, 2016 ప్రపంచకప్ ల్లో మాత్రమే టీమిండియాపై నెగ్గింది దాయాధి జట్టు. థాయిలాండ్ పై ఓడిన పాక్.. భారత జట్టుపై గెలుపుతో తిరిగి ట్రాక్ లోకి వచ్చింది. కాగా, ఇప్పటికే భారత మహిళల జట్టు మూడు విజయాలతో గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి సెమీస్‌కు చేరే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. భారత జట్టు తదుపరి మ్యాచులో బాంగ్లాదేశ్ విమెన్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 8న జరగనుంది.
Women’s Asia Cup; Pakistan beats India by 13 runs. This is Pakistan’s first T20I win against India since 2016. #WellDoneGirls pic.twitter.com/8uenJy8wIn
— Faizan Lakhani (@faizanlakhani) October 7, 2022