టీ20 ప్రపంచకప్ సాధించడమే లక్ష్యంగా ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచులో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 186 పరుగులు చేయగా, ఆసీస్ జట్టు 180 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే ఈ మ్యాచులో ప్లేయింగ్ 11లో లేని ఆటగాడు వచ్చి ఆఖరి ఓవర్ బౌలింగ్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొండత లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచినా బౌలర్లు కట్టి చేయలేకపోతున్నారు. దీంతో బుమ్రా లేని భారత పేస్ అటాక్ ఎలా ఉంటుందోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాక్ మాజీ ఆటగాడు ఆకిబ్ జావెద్ స్పందించాడు.
2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్ ను ముద్ధాడిన భారత జట్టు.. ఆపై ఒక్కసారి కూడా దాన్ని అందుకోలేకపోతోంది. ఇందుకు సవా లక్ష కారణాలున్నాయి. బ్యాటర్లు రాణిస్తే బౌలర్లు చేతులెత్తేయడం, బౌలర్లు రాణిస్తే బ్యాటర్లు విఫలమవడం.. ఒకవేల ఇద్దరూ రాణిస్తే ఫీల్డింగ్ లో తప్పిదాలు చేయడం.. ఇలా ఏదో కారణంతో టోర్నీ మధ్యలోనే ఇంటిబాట పడుతున్నారు. పోనీ, ఈసారైనా ఆ కోరిక నెరవేరుతుందా అంటే.. గాయాలతో ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమవ్వడంతో మరోసారి అలాంటి పరిస్థితి ఎదురవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా బుమ్రా లేని లోటు స్పష్టంగా కనపడుతోంది. ఆస్ట్రేలియా జరిగిన వామప్ మ్యాచ్ అందుకు చక్కటి ఉదాహరణ.
ఆస్ట్రేలియా ముందు 187 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచినా బౌలర్లు కట్టి చేయలేకపోయారు. ఆస్ట్రేలియా ఆటగాళ్ల తప్పిదాల కారణంగా మ్యాచ్ గెలిచాం.. కానీ, షమీ మినహా మన బౌలర్లు రాణించింది లేదు. దీంతో బుమ్రా లేని భారత బౌలర్ల ప్రదర్శన టోర్నీ అమాంతం ఇలానే ఉంటుందా? అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై దీనిపై పాక్ మాజీ ఆటగాడు ఆకిబ్ జావెద్ స్పందించాడు. “బుమ్రా లోటు భారత బౌలింగ్ లైనప్ ను ఇబ్బందిపడుతోంది. మనకున్న షాహీన్ ఆఫ్రిది, రవూఫ్ లాంటి ఇంపాక్ట్ బౌలర్లు వారికి లేరు. వారి వద్ద ఉన్నదల్లా మీడియం పేస్ బౌలర్లు మాత్రమే. అయితే ఏం.. ఏ సమయంలోనైనా ఆటను మార్చగల శక్తి హార్దిక్ పాండ్యాకు ఉంది” అంటూ జావెద్ పేర్కొన్నాడు. ఇక గాయాల కారణంగా జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్, బుమ్రా స్థానంలో షమీని ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ మెగా టోర్నీలో భారత జట్టు తన తొలి మ్యాచులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఈ నెల 23న జరగనుంది.
Former Pakistan cricketer Aaqib Javed doesn’t fancy the Indian team as a side that can go all the way in the T20 World Cup 2022. But, Javed does feel that Hardik Pandya is a player who can change the… https://t.co/FtRzn30LSi
— Qudach India (@QudachIndia) October 16, 2022