విచిత్రమైన షాట్లతో బౌలర్లపై విరుచుకుపడుతుంటాడు విధ్వంసకర బ్యాటర్ మ్యాక్స్‌వెల్. భీకరమైన హిట్టింగ్‌తో మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపుతిప్పుతుంటాడు. స్విచ్‌హిట్, రివర్స్ స్విప్‌లతో ప్రత్యర్థి ఫీల్డింగ్‌తో ఒక ఆట ఆడుకుంటాడు. కానీ.. టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా సోమవారం భారత్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో మాత్రం మ్యాక్సీ లెక్క తప్పింది.. బాల్ మొఖానికి తగిలి దిమ్మతిరిగింది. సాధారణగా స్పిన్నర్లు బౌలింగ్ వేస్తున్న సమయంలో బ్యాటర్లు హెల్మెట్ లేకుండానే ఆడతారు. మ్యాక్స్‌వెల్ కూడా యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో హెల్మెంట్ లేకుండా క్యాప్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రివర్స్ హిట్‌తో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మ్యాక్సీ మిస్ టైమ్ అయ్యాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా మ్యాక్సీ చెంపపై బలంగా తాకింది. అంతే.. ఆ దెబ్బకు మ్యాక్సీ తల గిర్రున తిరిగింది. వెంటనే ఫిజియ్ గ్రౌండ్‌లోకి పరిగెత్తుకు వచ్చి చూసి.. హెల్మెట్ పెట్టి ఆడమని ఇచ్చిపోయాడు.
ఈ సంఘటన సోమవారం భారత్-ఆస్ట్రేలియా గాబా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో 7 బంతుల్లో 7 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద బ్యాటింగ్ చేస్తున్న మ్యాక్స్‌వెల్ యుజ్వేంద్ర చాహల్ వేసిన ఇన్నింగ్స్ 13వ మూడో బంతిని మ్యాక్సీ రివర్స్ హిట్‌తో భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ.. చాహల్ స్పిన్ మాయాజాలం ముందు.. మ్యాక్సీ మ్యాడ్ షాట్ మిస్ టైమ్ అయింది. బంతి బ్యాడ్ ఎడ్జ్ తీసుకోవడంతో.. బంతి వేగం మరింత పెరిగి.. మ్యాక్సీ మొఖానికి బలంగా తాకి.. థర్డ్ మ్యాన్ వైపు వెళ్లిపడింది. అంత గట్టి దెబ్బ తగిలి.. తల గిర్రున తిరిగినా.. మ్యాక్స్‌వెల్ ఆ బాల్‌కు సింగిల్ తీసుకున్నాడు. వెంటనే చాహల్, రోహిత్ శర్మ.. మ్యాక్సీని దెబ్బతీవ్రత అడిగి తెలుసుకున్నారు. వెంటనే గ్రౌండ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చిన ఆసీస్ ఫిజియో.. పెద్ద ప్రమాదం ఏమీ లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా.. ఈ దెబ్బ తర్వాత స్పిన్నర్లను కూడా హెల్మెట్‌తోనే ఆడాడు మ్యాక్స్‌వెల్. కానీ.. చాహల్ ఓవర్‌లో దెబ్బ తగిలినా.. రెండు బౌండరీలు బాదాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్(57), సూర్యకుమార్ యాదవ్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా కూడా భారత బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొని విజయం వైపు సాగారు. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ టీమిండియా బౌలర్లపై ఎదురు దాడికి దిగి హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. కానీ.. చివర్లో విరాట్ కోహ్లీ చేసిన అద్భుతమైన ఫీల్డింగ్, షమీ వేసిన అత్యాద్భుతమైన చివరి ఓవర్‌తో టీమిండియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. 6 బంతుల్లో 11 రన్స్ అవసరమైన దశలో చివరి ఓవర్ వేసిన షమీ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి.. 4 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక రనౌట్ కూడా ఉంది. దీంతో ఈ వామప్ మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తర్వాత న్యూజిలాండ్‌తో మరో వామప్ మ్యాచ్ ఆడనుంది. 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అసలు సిసలైన పోరుకు సిద్ధమవుతుంది.
Ouch 😳😳
Maxwell use helmet pleaseCredit @FoxCricket#INDvAUS#T20WorldCup #T20worldcup22 pic.twitter.com/kAVKXf0kSv
— Honey Ansari (@pakcrichd) October 17, 2022