క్రికెట్ లో గెలుపోటములు సహజం. ఓడిపోయినంత మాత్రం వారిని తక్కువగా, చులకనగా చూడటం.. మాట్లాడటం చేయకూడదు. అలాగే వారి చరిత్రను తెలుసుకోకుండా నోరు జారకూడదు. అయితే ఈ నీతి పాకిస్థాన్, ఇంగ్లాండ్ ఆటగాళ్లకు లేదని తాజాగా వారు చేసిన ట్వీట్స్ ను బట్టి చూస్తే తెలుస్తుంది. ఓ వైపు అక్తర్ టీమిండియాపై విమర్శలు గుప్పిస్తుంటే తగుదునమ్మా అంటూ వచ్చాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. సెమీస్ లో ఇంగ్లాండ్ పై టీమిండియా ఓడిపోవడంతో తన నోటికి పని చెప్పాడు వాన్. ట్విట్టర్ వేదికగా టీమిండియాపై విమర్శలు గుప్పించాడు. చూశారుగా టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఎలాకొట్టామో.. 2023 వరల్డ్ కప్ లో భారత్ ను భారత్ లోనే ఓడిస్తాం. అసలు ప్రపంచ కప్ స్టార్ట్ అయినప్పుడల్లా టీమిండియానే ఫేవరెట్ అనడం నాన్సెన్స్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు వాన్. తాజాగా ఈ విమర్శలు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు దిగ్గజ బ్యాటర్ వసీం జాఫర్. వాన్ కు ఎక్కడో కాలుతున్నట్లుంది.. ఈ బర్నాల్ రాసుకో అంటూ ఎపిక్ రిప్లై ఇచ్చాడు.
వసీం జాఫర్.. తన అద్భుతమైన బ్యాటింగ్ తోనే కాకుండా ట్విట్టర్ వేదికగా అంతకంటే అద్భుతమై చలోక్తులతో నవ్విస్తుంటాడు జాఫర్. ఇక టీమిండియా మీద విమర్శలు చేసే జాదూగాళ్లకు సెటైరికల్, ఎపిక్ రిప్లేలు ఇస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు జాఫర్. ఒక్కోసారి వసీం జాఫర్ రిప్లై లు చూస్తే.. ఇంత కామెడీ టైమింగ్ ఎక్కడిది అంటూ ప్రశంసించకుండా ఉండలేం. తాజాగా మైఖేల్ వాన్ కు ఇలాగే దిమ్మతిరిగే కౌంటర్ రిప్లై ఇచ్చాడు జాఫర్. ఈ క్రమంలోనే వసీం జాఫర్ ను పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ గా నియమించింది యాజమాన్యం.
ఈనేపథ్యంలో జాఫర్ బ్యాటింగ్ కోచ్ గా నియమించడంపై వాన్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా వ్యాఖ్యానించాడు. “నా చేతిలో ఓడిన వ్యక్తిని బ్యాటింగ్ కోచ్ గా ఎన్నుకోవడం ఏంటి” అంటూ రాసుకొచ్చాడు వాన్. దానికి సమాధానంగా వసీం జాఫర్.. “మైఖేల్ వాన్ కు ఎక్కడో కాలుతున్నట్లుంది. వాన్ ఈ బర్నాల్ తీసుకుని రాసుకో” అంటూ వాన్ కామెంట్ కు సెటైరికల్ గా బర్నాల్ యాడ్ ను జతచేశాడు జాఫర్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది. దాంతో జాఫర్ కామెడీ టైమింగ్ కు నెటిజన్లు ఫిదా ఐపోతున్నారు. జాఫర్ భాయ్ వాన్ కు గట్టిగా ఇచ్చావ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
https://t.co/9J2SQX3b3K pic.twitter.com/Crq47x3fvt
— Wasim Jaffer (@WasimJaffer14) November 17, 2022