విరాట్ కోహ్లీ.. తాజాగా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ కు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ సమయాన్ని ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కు వెళ్తు ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రముఖ తీర్థయాత్ర ప్రదేశాలను దర్శించుకుంటూ సమయాన్ని గడుపుతున్నాడు. ఇక ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు విరాట్. అదీకాక కోహ్లీ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ అన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా విరాట్ కోహ్లీ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీగా ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. అందులో పేరు ప్రఖ్యాతలు కోరుకోవడం ఓ జబ్బు అని, త్వరలోనే దానినుంచి బయటపడతాను అని ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
విరాట్ కోహ్లీ.. టీమిండియా స్టార్ బ్యాటర్ గా కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రన్ మిషన్ గా రికార్డులు కొల్లగొడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న కోహ్లీ.. తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా స్టోరీస్ పోస్ట్ ను షేర్ చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కొటేషన్ తో పాటుగా హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ కు చెప్పిన మాటల వీడియోలను కోహ్లీ తాజాగా షేర్ చేశాడు. అందులో ఈ విధంగా ఉంది.”జీవితంలో పేరు ప్రఖ్యాతలు కోరుకోవడం ఓ వ్యాధిలాంటిది. నేను ఎప్పుడో ఒకప్పుడు ఈ వ్యాధి నుంచి విముక్తి పోందాలనుకుంటున్నా, ఇక ఎక్కడైతే పేరు ప్రఖ్యాతులతో అవసంర ఉండదో.. ఎక్కడైతే లైఫ్ ను సంపూర్ణంగా అనుభవిస్తానో.. అక్కడ నేను సంతృప్తితో సరిపెట్టుకుంటా” అని ఇర్ఫాన్ ఖాన్ అన్న కొటేషన్ ను షేర్ చేశాడు విరాట్.
అదే విధంగా మరో స్టోరీలో.. హాలీవుడ్ నటుడు అయిన టామ్ హాంక్స్ వీడియోను పోస్ట్ చేశాడు. “ఇలా కూడా జరుగుతుంది అని తెలిస్తే ఎంతో సంతోషంగా ఉండేది. ఇప్పుడు సరిగ్గా లేదని భావించడం, బోర్ గా ఉందని ఫీల్ అవ్వడం, కోపం కలిగి ఉండటం.. ఇలాంటివి అన్ని జరిగిపోతాయి. మీకే అన్ని ఆన్సర్స్ తెలుసు అనుకోవడం, లాస్ట్ కు మిమ్మల్నే అందరు కావాలి అనుకోవడం” అని టామ్ చెప్పిన మాటల వీడియోను షేర్ చేశాడు. అయితే కోహ్లీ ఇప్పుడు వీటిని ఎందుకు పోస్ట్ చేశాడో అభిమానులకు అర్థం కావడంలేదు. ఇక మంగళవార జరగబోయే వన్డేకు సిద్ధం అవుతున్నాడు కింగ్ కోహ్లీ.