గౌహతీ వేదికగా మంగళవారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో పాటు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. కోహ్లీ 113, రోహిత్ 83, గిల్ 70 రన్స్‌తో రాణించడంతో ఈ భారీ స్కోర్ సాధ్యమైంది. అయితే.. శ్రీలంక సైతం గట్టిగానే జవాబు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 374 పరుగులు భారీ లక్ష్యఛేదనలో 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లంక 306 పరుగులు చేసి.. 67 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కానీ.. ఆ జట్టు కెప్టెన్ డసన్ షనక మాత్రం 108 పరుగులతో అద్భుత పోరాటం చేశాడు. మ్యాచ్‌ను గెలిపించలేకపోయినా.. సెంచరీతో అందరి మనసులు గెలుచుకున్నాడు.
ఇక చాలా కాలంగా ఫామ్‌లేకుండా విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కాస్త పర్వాలేదనిపించాడు. మంచి షాట్‌లతో వేగంగా ఆడుతూ.. మంచి టచ్‌లో కనిపించాడు. 29 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 39 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రాహుల్ బ్యాటింగ్ అప్రోచ్‌లో కాస్త తేడా కనిపించింది. కొంచెం అగ్రెసివ్‌గానే ఆడే ప్రయత్నం చేశాడు. కొంతకాలంగా చాలా నిదానంగా ఆడుతూ.. భయం భయంగా బ్యాటింగ్ చేస్తున్నాడంటూ విమర్శలు వచ్చాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో మాత్రం రాహుల్ కాస్త వేగంగానే ఆడాడు. కానీ.. ఒక సింపుల్ బాల్‌కు అవుట్ అయ్యాడు. బ్యాటింగ్ విషయంలో కేఎల్ రాహుల్ పరిస్థితి ఇలా ఉంటే.. వికెట్ కీపర్‌గా మాత్రం తేలిపోయాడు.
ఒకానొక దశలో లంక కెప్టెన్ షనకను రనౌట్ చేసే గోల్డెన్ ఛాన్స్‌ను కేఎల్ రాహుల్ మిస్ చేశాడు. ఎక్కడో బౌండరీకి వెళ్లిన బంతిని కీపర్ ఎండ్ వైపు త్రోగా వస్తుంటే.. దాని కోసం ముందే వచ్చి వికెట్ల వద్ద నిలబడకుండా.. తన కీపింగ్ స్పాట్ నుంచి తీరా బాల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దీంతో షనక రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ.. ఇదేం కీపింగ్ అంటూ సైగ చేస్తూ..అసహసం వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్ సరైన సమయంలో స్పందించి ఉంటే.. షనక రనౌట్ అయి ఉండేవాడు. ఈ ఘటన శ్రీలంక ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో జరిగింది. షమీ వేసిన తొలి బంతిని షనక లాంగ్ ఆన్ వైపు ఆడాడు. ఆ బాల్‌కు రెండు రన్స్‌వచ్చాయి. కానీ.. రాహుల్ వికెట్లకు దగ్గరగా ఉంటే.. అది రనౌట్‌గా మారేది. రాహుల్ నిర్లక్ష్యంగా షనక బతికిపోయాడు. దీనిపై కోహ్లీ కాస్త సీరియస్‌గానే రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) January 11, 2023