టిక్కెట్ల కోసం అష్టకష్టాలు పడి ఎలాగోలా స్టేడియంలోకి వెళ్లిన ప్రేక్షకులకు ఉప్పల్ పోరు ఉర్రూతలూగించింది. సిరీస్ డిసైడర్ మ్యాచ్ అందుకు తగ్గ మజానే చూపెట్టింది. మొదట కామెరూన్ గ్రీన్ వీర బాదుడు, మధ్యలో భారత స్పిన్నర్లు చాహల్, అక్షర్ పరాణించడం, డెత్ ఓవర్లలో డేవిడ్ పవర్ హిట్టింగ్, ఆపై.. సూర్య, కోహ్లీ ఇద్దరే మ్యాచును ముగించడం.. ఇలా చూస్తున్నంతసేపు చాలా ఆహ్లాదకరంగా సాగింది. అందులోనూ మ్యాచులో చాలా ఫన్నీ ఇన్సిడెంట్లు జరిగాయి. డీకేకు రోహిత్ ముద్దివ్వడం, కోహ్లీ – రోహిత్ సంభాషణ ఇలాంటివి చాలానే జరిగాయి. వీటన్నింటిని మించిన ఫన్నీ ఇన్సిడెంట్ మరొకటి వెలుగులోకి వచ్చింది.
మైదానంలో విరాట్ ప్రవర్తన ఎలా ఉంటుందో మనందరకి తెలిసిందే. మ్యాచ్ పరిస్థితితో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ యాక్టీవ్ గా కనిపిస్తుంటాడు. అందులోనూ కెప్టెన్సీని వదులుకున్నాక కోహ్లీలో చలాకీతనం మరీ ఎక్కువైంది. రెండ్రోజుల క్రితమే.. హార్దిక్ పాండ్యాతో కలిసి కాలు కూడా కదిపాడు. ఇవన్నీ పక్కన పెడితే.. ఉప్పల్ పోరులో కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీకి మోస్ట్ మోస్ట్ ఎనర్జిటిక్ అవార్డు దక్కింది. ఈ క్రమంలో అవార్డు అందుకోవడానికి వెళ్లిన కోహ్లీ.. వెళ్ళేటపుడు నెమ్మదిగా వెళ్తే, వచ్చేటపుడు పరుగులు తీస్తూ వస్తాడు. ‘ఇదే ఎనర్జిటిక్ అన్నట్లుగా పరుగులు తీశాడు’. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.