సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు. టీమిండియా ABDగా పేరుతెచ్చుకున్న సూర్యకుమార్.. తనదైన శైలిలో చెలరేగి ఆడుతున్నాడు. అలాగే టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ లో సైతం దుమ్మురేపాడు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ను వెనక్కి నెట్టి నెం. 3 స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా హైద్రాబాద్ వేదికగా ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో 5 ఫోర్లు, 5 సిక్స్ లతో చెలరేగి 69 పరుగులు చేశాడు. దాంతో టీమిండియా సిరీస్ ను 2-1 తో కైవసం చేసుకుంది. అయితే ఇదంతా మనకు పైకి కనిపించేది.. కానీ మ్యాచ్ కు ముందు ఉదయం తన ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని SKY వివరించాడు. ఆరోగ్యం సహకరించకపోయినా.. జట్టు కోసం బాధను దిగమింగుకొని మ్యాచ్ ఆడాడు. దాంతో అతడి కమిట్ మెంట్ కు క్రీడాలోకం మెుత్తం సలామ్ కొడుతోంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దాంతో నిర్ణయాత్మకమైన 3వ టీ20లో భారత్ కచ్చితంగా గెలవాలి. ఈ క్రమంలోనే టీమిండియా డ్యాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ జ్వరం బారిన పడ్డాడు. కానీ ఆవిషయం ఎవరికీ చెప్పలేదు. మ్యాచ్ అనంతరం సూర్య కుమార్ మాట్లాడుతూ..”ఈ మ్యాచ్ కు ముందు నాకు జ్వరం వచ్చింది.. అదీ కాక కడుపులో నొప్పికూడా మెుదలైంది. నాకు తెలుసు ఈ మ్యాచ్ టీమిండియాకు ఎంత కీలకమైనదో! అందుకే అనుకున్నా.. ఈ మ్యాచ్ నేను ఎలాగైనా ఆడాలి అని. ఇదే విషయాన్ని నేను డాక్టర్ కు, నా ఫిజియోకు వివరించా.. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. నేను ఈ మ్యాచ్ గ్యారంటీగా ఆడాలి. ఇది నాకు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లాంటింది. నేను ఈ చిన్న కారణంతో డ్రస్సింగ్ రూంలో కూర్చుని మ్యాచ్ చూడలేను. మీరు నాకు ఏ మందులు ఇస్తారో.. ఏ ఇంజెక్షన్స్ వేస్తారో తెలీదు. కానీ నేను క్యూర్ కావాలి అంతే” అని డాక్టర్, ఫిజియోకి చెప్పినట్లు వివరించాడు.
దాంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు SKY ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తన ఆరోగ్యం కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యం అని మ్యాచ్ ఆడాడు అని కొందరంటే.. ఇదే నిజమైన దేశభక్తి అంటే అని మరికొందరు రాసుకొచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో సూర్య కుమార్ యాదవ్ టీ20ల్లో చెలరేగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక సూర్య కుమార్ కెరీర్ విషయానికి వస్తే.. 32 టీ20ల్లో 1 శతకం, 7 అర్దశతకాలతో 926 పరుగులు చేశాడు. ఇక స్ట్రైక్ రేట్ 174 ఉండటం విశేషం. జట్టు పరిస్థితులను అర్ధం చేసుకుని మెలిగే వాడే అసలైన విజేత అని సూర్యకుమార్ నిరూపించాడు. మరి జ్వరం, కడుపు నొప్పి ఉన్నాగానీ మ్యాచ్ ఆడటమే కాకుండా.. మ్యాచ్ ను గెలిపించిన సూర్యకుమారుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The commitment and dedication of @surya_14kumar 👏#SuryakumarYadav #INDvAUS #CricketTwitter pic.twitter.com/WiZxscxL5g
— CricTracker (@Cricketracker) September 26, 2022
For his breathtaking batting display in the chase, @surya_14kumar bags the Player of the Match award. 👏 👏
Scorecard ▶️ https://t.co/xVrzo737YV #TeamIndia | #INDvAUS pic.twitter.com/YrvpUyDTxt
— BCCI (@BCCI) September 25, 2022