క్రికెట్ లో ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. బంతి.. బంతికి మ్యాచ్ మారుతూ వస్తుంది. దాంతో చివరి బాల్ పూర్తి అయ్యే వరకు మ్యాచ్ ఎవరు గెలుస్తారో చెప్పలేం. తాజాగా అలాంటి మ్యాచ్చే ఇంగ్లాండ్ వర్సెస్ పాక్ మధ్య జరిగింది. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం 4వ టీ20 మ్యాచ్ జరిగింది. ఎంతో ఉత్కంఠతతో జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు అసలు.. సిసలైన మజాను అందించింది. ఇంగ్లాండ్ విజయానికి 2 ఓవర్లలో 9 పరుగులు కావాలి. చేతిలో 3 వికెట్లు కూడా ఉన్నాయి. చివరికి ఏమైంది అయ్యింది అంటే? ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
కరాచీ వేదికగా ఇంగ్లాండ్-పాక్ మధ్య 4 వ టీ20 మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పొయి 166 పరుగుల చేసింది. పాక్ జట్టులో రిజ్వాన్ 67 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్ తో 88 రన్స్ చేశాడు. అజామ్ 36 పరుగులతో రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్ కు 97 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించారు. కానీ దానిని జట్టు ఉపయోగించుకోలేక పోయింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో టోప్లి 2 వికెట్లు తీయగా, డస్సన్, విల్లీ తలా ఓ వికెట్ తీశారు. అనంతరం 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిటీష్ జట్టు 19.2 ఓవర్లలో 163 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లాండ్ జట్టులో బ్రూక్స్(34), డాస్సన్(34), డకెట్(33) పరుగులు చేశారు.
ఇంగ్లాండ్ జట్టు విజయానికి 2 ఓవర్లలో 9 పరుగులు కావాలి. చేతిలో 3 వికెట్లు కూడా ఉన్నాయి. దాంతో ఎవరైనా ఏమనుకుంటారు. కచ్చితంగా ఇంగ్లాండ్ టీమే గెలుస్తుంది అనుకుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. 19వ ఓవర్ వేయడానికి హారిస్ రౌఫ్ వచ్చాడు. ఈ ఓవర్ 2వ బంతికి బౌండరి వచ్చింది. దాంతో సమీకరణాలు 10 బంతుల్లో5 పరుగులకు చేరుకుంది. ఈక్రమంలోనే వరుస బంతుల్లో రౌఫ్ డాసన్, అలీ స్టోన్ లను అవుట్ చేశాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్ లో ఇంగ్లాండ్ విజయానికి 4 రన్స్ కావాలి. మహ్మద్ వసీమ్ జునీయర్ బౌలింగ్ కు వచ్చాడు. అద్భుతమైన బంతితో బ్రిటిష్ బ్యాటర్ ను ఇబ్బందికి గురిచేశాడు. రెండో బంతికే ఇంగ్లాండ్ టెయిలెండర్ టోప్లీ(0) రనౌట్ అయ్యాడు. దాంతో 3 పరుగుల తేడాతో పాక్ గెలిచింది. పాక్ బౌలర్లలో నవాజ్ 3, రౌఫ్ 3 వికెట్లు పడగొట్టారు. దీంతో 7 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 2-2తో ఇరు జట్లు సమంగా నిలిచాయి. అద్భుతంగా బౌలింగ్ చేసిన హారిస్ రౌఫ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. మరి గెలవాల్సిన మ్యాచ్ ను చేజేతులా ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Congratulations green shirt
What a match!!!!
nice bowling by Haris rauf#PAKvENG #chacha
#Hasnain #PakvsEngland #Nawaz pic.twitter.com/lQKoDFRDZq— dr_shugli (@teeky_wala) September 25, 2022
What a Match!! 🇵🇰👏👏👏
When one loses hope, Pakistan still believes..
Unbelievable..
The craziest cricket team in history of ALL sports. I am convinced. There’s no argument. None #PakvsEngland pic.twitter.com/ihjOfVWo9e— Hira Yaseen (@HiraY35) September 25, 2022