టీమిండియాకు రెండు ప్రపంచ కప్‌లు అందించిన మహేంద్రసింగ్ ధోని భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా ఉన్నాడు. సుదీర్ఘ కాలం టీమిండియా కెప్టెన్‌గా ఉన్న ధోని.. తన వ్యూహ్యాలతో భారత్‌కు అనేక విజయాలు అందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ధోని కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. కాగా.. తాజాగా ధోనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అందుకు ధోని చేసిన వ్యాఖ్యలే కారణం అయ్యాయి. సెప్టెంబర్ 24న తన సోషల్ మీడియా ఖాతాలో ఆదివారం ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నట్లు ధోని వెల్లడించాడు. దీంతో ధోని ఏం చెప్పబోతున్నాడో అని యావత్ క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. క్రికెట్‌కు పూర్తిగా దూరం అవుతున్నాడా? లేక కొత్త కెరీర్ మొదలుపెడుతున్నాడా? రాజకీయాల్లోకి వస్తున్నాడా? అంటూ రకరకాల ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి.
కానీ.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఓరియో బిస్కెట్స్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు ధోని. ఈ సంఘటనతో తీవ్ర నిరాశ చెందిన క్రికెట్ అభిమానులకు ఆ సమావేశంలో ధోని చేసిన వ్యాఖ్యలు మరింత కోపం తెప్పించాయి. ఓరియో ప్రమోషన్స్‌లో మాట్లాడిన ధోని.. 2011లో ఓరియో లాంచ్ అయింది.. 2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. మళ్లీ ఇప్పుడు ఓరియో కొత్త ఎడిషన్ లాంచ్ అవుతుంది.. మళ్లీ టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని అన్నాడు. ఏదో ముఖ్యమైన విషయం చెబుతాడు అనుకుంటే ఇలా బిస్కెట్ కంపెనీకి ప్రచారం చేస్తున్నాడంటి? అని అందరూ ఆసహనం వ్యక్తం చేశారు. పైగా ఓరియో లాంచ్‌ను టీమిండియా వరల్డ్ కప్ గెలవడానికి ముడి పెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
ఈ విషయం కొంతమంది క్రికెట్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. 2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలవడానికి ఓరియో బిస్కెట్స్ కారణమైతే.. మరి 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా తొలి వన్డే వరల్డ్ కప్‌ను, 2007లో తొలి టీ20 వరల్డ్ కప్‌ను ఎలా సాధించిందని ప్రశ్నింస్తున్నారు. ఓరియో లాంచ్‌ను వరల్డ్ కప్ గెలుపునకు లింక్ చేయడం సరికాదని.. అది ఆటగాళ్లను, టీమిండియాను అవమానించడమే అవుతుందని మండిపడుతున్నారు. అసలు ఒక వ్యాపార ప్రకటనను దేశం మొత్తం ఎంతో గర్వపడే అద్వితీయ విజయంతో పోల్చడం ముమ్మాటికీ తప్పేనని నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. గతంలో మరో వ్యాపార ప్రకటనలో ధోని నటించిన వీడియో కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన యాడ్‌లో డబ్బులు ఇస్తే క్రికెటర్లు ఏమైన చెబుతారు అనే లైన్ ఉంది. అందులో ధోని కూడా నటించాడు. ఇప్పుడు ఓరియో ప్రచారం కోసం ధోని వరల్డ్ కప్‌ను పోల్చిన వీడియోపై ఆ వీడియోతో నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. డబ్బులు ఇస్తే క్రికెట్లర్లు ఏమైనా చెప్తారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఏది ఏమైన భారత క్రికెట్‌లో ఒక దిగ్గజంగా ఉన్న ధోని ఇలాంటి సిల్లీ బిజినెస్ స్ట్రాటజీల్లో భాగమై తనపై క్రికెట్ వర్గాల్లో ఉన్న గౌరవ మర్యాదలను తగ్గించుకుంటున్నాడంటూ క్రికెట్ నిపుణులు, ధోని అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MS Dhoni & Reporter never Ending love Story 😂😂 pic.twitter.com/r9zUSRz8Yu
— DIPTI MSDIAN (@Diptiranjan_7) September 25, 2022
New Oreo cookies with MS Dhoni on it. pic.twitter.com/YClGkDmZis
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 25, 2022
ఇది కూడా చదవండి: ఇందుకే కదయ్యా నిన్ను ఛేజ్ మాస్టర్ అనేది! కోహ్లీ ఖాతాలో వరల్డ్ రికార్డ్